Biometric UPI Payments Settings| నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యుపిఐ ( UPI) చెల్లింపుల కోసం బయోమెట్రిక్ (ఫింగర్‌ప్రింట్, ఫేస్ గుర్తింపు) సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇకపై మీ ఫోన్ నుంచి గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లాంటి యుపిఐ పేమెంట్స్ కోసం పిన్ నంబర్ అవసరం లేదు. ఈ బయోమెట్రిక్ విధానం చెల్లింపులను వేగవంతం చేస్తుంది. సెక్యూరిటీని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పిన్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం కష్టమైన వృద్ధుల లాంటి వారికి ఇది చాలా ఉపయోగకరం. ఈ విధానంలో మోసాలు నివారించడం లేదా గుర్తించడం సులభం అవుతుంది.
ఫేస్ అన్‌లాక్
మొదట, మీ UPI యాప్‌ను తాజాగా అప్‌డేట్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే లేదా ఏదైనా ఇతర చెల్లింపు యాప్‌ను ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ లేదా ప్రొఫైల్ విభాగానికి వెళ్ళండి. బయోమెట్రిక్ గుర్తింపు ఆప్షన్‌ను కనడుతుంది. చెల్లింపుల కోసం “ఫేస్ అన్‌లాక్” ఎంచుకోండి.
సెటప్ పూర్తి చేయండి
చివరగా, మీ UPI పిన్‌ను నమోదు చేయండి. ఇది మీ గుర్తింపును నిర్ధారిస్తుంది. బయోమెట్రిక్ సెటప్ పూర్తవుతుంది. అంతే ఇకపై మీ ఫేస్ ఐడీతో చెల్లింపులు చేయవచ్చు. సెటప్‌కు రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది.
మీ UPI యాప్‌ను తెరవండి. ఒక కాంటాక్ట్‌కు చెల్లింపు ప్రారంభించండి. చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేయండి. “యూజ్ బయోమెట్రిక్” (బయోమెట్రిక్ ఉపయోగించు) ఆప్షన్ ను ఎంచుకోండి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌పై వేలు ఉంచండి.
ఫింగర్‌ప్రింట్ రీడింగ్
మీ ఫింగర్‌ప్రింట్‌ను ఫోన్ స్కాన్ చేస్తుంది. వేలును స్థిరంగా ఉంచండి. చెల్లింపు నిర్ధారణ వస్తుంది. ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
ఇప్పుడు ఫేస్ ఐడీతో చెల్లించే విధానం చూద్దాం. UPI చెల్లింపును సాధారణంగా ప్రారంభించండి. చెల్లింపు మొత్తాన్ని నమోదు చేయండి. “ఫేస్ ఐడీ ఉపయోగించు” ఆప్షన్ ఎంచుకోండి. మీ కళ్ళను ఫ్రంట్ కెమెరాకు చూపించండి. సహజంగా మీ కనురెప్ప ఒకసారి వేయమని ఫోన్ లో అడగవచ్చు.
ఫేస్ గుర్తింపు ప్రక్రియ
మీ ముఖాన్ని పరికరం స్కాన్ చేస్తుంది. రెండు సెకన్లలో చెల్లింపు నిర్ధారణ అవుతుంది. టచ్‌లెస్ ఇంటరాక్షన్ అవసరం లేదు. పగటిపూట బాగా పనిచేస్తుంది. ఇండోర్ లైటింగ్‌లోనూ పనిచేస్తుంది.
మీ బయోమెట్రిక్ డేటా మీ పరికరంలోనే ఉంటుంది. థర్డ్ పార్టీలకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. ప్రతి పేమెంట్‌కు కొత్త గుర్తింపు జరుగుతుంది. ఇది మోసపూరిత లావాదేవీలను నిరోధిస్తుంది. మీ ఆర్థిక సమాచారం పూర్తిగా సురక్షితం.
సౌలభ్యం
ఇకపై పిన్ నెంబర్ గుర్తపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బయోమెట్రిక్‌తో చెల్లింపులు వేగంగా, సులభంగా జరుగుతాయి. జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నవారికి ఉపయోగకరం.
మీ ముఖం స్పష్టంగా కనిపించే లైటింగ్ ఉపయోగించండి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను శుభ్రంగా ఉంచండి. ఫోన్ ఓఎస్‌ను తాజాగా అప్‌డేట్ చేయండి. బయోమెట్రిక్స్ పనిచేయకపోతే కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి.
Also Read: : గూగుల్ క్రోమ్ స్లోగా పనిచేస్తోందా? వెంటనే స్పీడ్ పెంచడానికి ఇలా చేయండి