NBK 111 Heroine: నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna ) ఆరుపదుల వయసు దాటినా కూడా వరుస పెట్టి యాక్షన్ చిత్రాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈయన.. మరొకవైపు హిస్టారికల్ చిత్రాలతో కూడా అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలకృష్ణ ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh malineni) దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్బికె 111 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘వీరసింహారెడ్డి’ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ బరిలో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఇందులో బాలకృష్ణతో నయనతార (Nayanthara) మళ్ళీ జతకట్టనుంది అని సమాచారం నయనతార ఈ సినిమాలో మహారాణి పాత్ర పోషిస్తోందట . అలాగే ఇందులో బాలకృష్ణ రాజు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు అభిమానులలో అంచనాలను పెంచేసింది.
ఇకపోతే బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇంకా సెట్ మీదకు వెళ్ళకముందే బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అనవసరమైన ఖర్చు పెట్టకుండా మొదట అనుకున్న బడ్జెట్ కంటే కాస్త తగ్గించుకొని మరీ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. నవంబర్ రెండవ వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో చాలా లాంచనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న ఈ సినిమాకి హిస్టారికల్ భారీ సెట్స్ వేయడం తప్పనిసరి. రాజులు, రాజ్యాల నేపథ్యంలో ఖర్చు అంటే చాలా ఎక్కువ అవుతుంది.. పైగా ఓటీటీ నుంచి కూడా అమౌంటు రావడం లేదు. ఇక అమెరికా నుంచి టాక్స్ లు ఎక్కువ కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..అందుకే ముందే డబ్బులు తగ్గించుకొని సినిమాను షూటింగ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.. ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు తీయబోతున్నారు. ఇదిలా ఉండగా కాంతార సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యపు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య ఈ సినిమా కోసం భారీగానే కష్టపడడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రాజుగా బాలకృష్ణ, నయనతార రాణిగా మరొకసారి కనిపించబోతున్నారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే శ్రీరామరాజ్యం, సింహ, జై సింహా వంటి సినిమాలు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.