Bigg Boss 9 Promo:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్.. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తికాగా ఇప్పుడు 9వ సీజన్ మొదలైంది. ఈ సీజన్ లో ఏడు వారాలు పూర్తయ్యాయి. ఎనిమిదవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది.. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారి కాస్త వినూత్నంగా నామినేషన్స్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. అందులో భాగంగానే ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన మాజీ హౌస్ మేట్స్ ను మళ్లీ హౌస్ లోకి పిలిపించి నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టారు.
ఇదిలా ఉండగా ఈరోజు జరగబోయే నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో బయటకు రాగా.. అందులో మాజీ ఎక్స్ హౌస్ మేట్స్ సందడి చేసినట్లు చూపించారు. ఇకపోతే తాజాగా బయటకొచ్చిన ప్రోమోలో ఏముంది? హౌస్ లోకి ఎవరెవరు మాజీ కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు అనే విషయం ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ కి మరో సమరం సిద్ధమైంది. మాటల తూటాలు, అభియోగాల చిట్టాలతో.. ఒకరిపై ఒకరు ఇన్ని రోజులు దాడి చేసుకున్నారు. ఒక కొత్త దృక్పథానికి శ్రీకారం చుట్టాము.. ఈసారి జరగబోయే నామినేషన్ కి సిద్ధంగా ఉండండి. మీరు ఆడే ఆటను ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసినవాళ్లు మీ తలరాతను రాయబోతున్నారు. అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.
ఇకపోతే మాజీ కంటెస్టెంట్స్ గా నిలిచిన మర్యాద మనీష్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ నలుగురు కూడా హౌస్ లోకి అడుగుపెట్టినట్లు చూపించారు. ఇక వీరంతా కూడా హౌస్ మేట్స్ ఆట తీరని చూసి ఇప్పుడు నామినేట్ చేయడానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అందులో భాగంగానే దమ్ము శ్రీజ కళ్యాణ్ ను నామినేట్ చేసింది. మిగతావారు ఎవరెవరిని నామినేట్ చేయబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
ALSO READ:NBK 111 Heroine: బాలయ్య మూవీలో నయన్.. ఏకంగా మహారాణి పాత్రలో!
ఇకపోతే హౌస్ లోకి వచ్చిన ఈ నలుగురు మాజీ కంటెస్టెంట్స్ తమ వాదనలను వినిపిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రణరంగంలా అనిపిస్తున్న ఈ బిగ్ బాస్ సీజన్ ఇప్పుడున్న వారిలో ఈవారం ఎవరిని హౌస్ నుండి ఇంటికి పంపించబోతున్నారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సీజన్లో తొమ్మిది మంది సెలబ్రిటీలు.. ఏడు మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇటు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో 6 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే
. ఇక వీరంతా కూడా ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.