OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు ఎంత భయంకరంగా ఉంటాయో, కానిబల్ సినిమాలు అంతకు మించే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కానిబల్స్ సైకోలుగా మనుషులను హింసించి తింటుంటారు. వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మరి చూస్తే ఎలావుంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అలాంటి సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘రాంగ్ టర్న్ 5: బ్లడ్‌లైన్స్’ (Wrong Turn 5: Bloodlines movie) అనే సినిమా 2012లో విడుదలైన అమెరికన్ స్లాషర్ హారర్ ఫిల్మ్. దీన్ని డెక్లాన్ ఓ’బ్రయిన్ రాసి, డైరెక్ట్ చేశాడు. ఇది రాంగ్ టర్న్ సిరీస్‌లో 5వ భాగం. రాంగ్ టర్న్ 4: బ్లడీ బిగినింగ్స్ కి సీక్వెల్. 92 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2012 అక్టోబర్ 23న విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఈ సినిమా వెస్ట్ వర్జీనియాలోని ఒక చిన్న టౌన్ లో ఉండే ఒక అందమైన లేక్‌లో మొదలవుతుంది. అక్కడ హాలోవీన్ సమయంలో ‘మౌంటైన్ మ్యాన్ ఫెస్టివల్’ జరుగుతుంటుంది. ఫుల్ మ్యూజిక్, కాస్ట్యూమ్స్, డ్యాన్స్‌లతో పెద్ద పార్టీ. బిల్లీ, లీటా, జూలియన్, గస్, క్రూజ్ అనే ఐదుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఈ ఫెస్టివల్‌కు కార్‌లో వస్తుంటారు. వాళ్లు రోడ్‌లో డ్రైవ్ చేస్తుంటే, మేనార్డ్ అనే ఒక క్రూరమైన మనిషిని వీళ్ళు అనుకోకుండా ఢీకొంటారు. మేనార్డ్ ఒక కానిబల్ కుటుంబానికి లీడర్. అతని కుటుంబంలో మొగ్గురు కానిబల్స్ ఉంటారు. వాళ్ళు వికృత రూపంలో ఉంటారు. వాళ్లు అడవుల్లో ఉంటూ, జనాలను కిడ్నాప్ చేసి, టార్చర్ చేసి, చంపి తింటారు. స్టూడెంట్స్ మేనార్డ్‌ను హిట్ చేసిన తర్వాత భయపడి పారిపోతారు. అయితే అతను వీళ్ళ వెంట పడుతుండటంతో స్టేషన్ లో కంప్లైన్ట్ ఇస్తారు. దీంతో ఎంజెలా అనే పోలీస్ ఆఫీసర్ మేనార్డ్‌ను అరెస్ట్ చేస్తుంది.
Read Also : నగరాన్ని తుడిచిపెట్టే డేంజర్ డిసీజ్… మనుషులను ఆయిల్ లో వేయించి తోలు ఒలిచే సైకోలు… బ్రూటల్ సీన్లు భయ్యా
ఇప్పడు ఈ కానిబల్ ఫ్యామిలీ వాళ్లు స్టూడెంట్స్‌ను టార్గెట్ చేస్తారు. మొదట గస్ ఒక రోడ్ ట్రాప్‌లో చిక్కుకుని, భయంకరంగా చనిపోతాడు. లీటా, బిల్లీ, జూలియన్, క్రూజ్ ఫెస్టివల్‌లో ఉంటారు. కానీ కన్నీలు వాళ్లను ఒక్కొక్కరుగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు పోలీసులు మేనార్డ్‌ను స్టేషన్లో ఇంటారేగేట్ చేస్తుంటారు. అతను క్రూరంగా నవ్వుతూ, పోలీసులను కూడా భయపెడతాడు. అయితే ఎంజెలా మేనార్డ్‌ను జైలు నుండి రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే కన్నీలు అతని కోసం టౌన్‌ను నాశనం చేస్తుంటారు. ఇప్పుడు మేనార్డ్ తన వాళ్ళతో కలిసి, మిగిలిన స్టూడెంట్స్‌పై ఫైనల్ అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో ఎవరు గెలుస్తారు ? కానిబల్స్ కు స్టూడెంట్స్ బలవుతారా ? కానిబల్స్ ని స్టూడెంట్స్ అంతం చేస్తారా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.