Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాలలో పెద్దగా నటించకపోయినా కూడా ఇక్కడ జనాలకు ఈయన సుపరిచితమే.. ఒకవైపు సినిమాలతో బాగా ఫేమస్ అవుతున్న కూడా మరోవైపు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ నిత్యం వార్తలో నిలుస్తుంటాడు సల్లూ భాయ్.. ఈయనపై దాడులు కూడా జరుగుతుండడంతో నిత్యం సల్మాన్ హాట్ టాపిక్ గా మారుతుంటాడు. అయితే ఎప్పటికప్పుడు తనపై వస్తున్న రూమర్ కి చెక్ పెడుతున్న ఈయనకి పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదిగా సల్మాన్ ఖాన్ పై ముద్ర వేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చడం కలకలం రేపుతోంది. అబుదాబిలో బలూచిస్తాన్ గురించి సల్మాన్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.. యాంటీ-టెర్రరిజం యాక్ట్ నాల్గోవ షెడ్యూల్ లో ఈయన పేరు చేర్చడం గమనార్హం. నిజానికి షెడ్యూల్ అనేది ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులను అనుమానించేందుకు కేటాయించిన కేటగిరీ. ఈ మేరకు పాకిస్తాన్ సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిందని కన్ఫామైంది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ విషయాన్ని బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ ధ్రువీకరించింది.. అసలు ఇంతమంది స్టార్ హీరోలు ఉండగా సల్మాన్ ఖాన్ పై ఎందుకు పాకిస్తాన్ కక్ష కట్టింది అన్న ప్రశ్నలు బాలీవుడ్ జనాల్లో వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ హీరో పై పాక్ ఉగ్రవాదిగా ముద్ర వేసింది? ఏదైనా బలమైన కారణం ఉందా? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి.. ఈ ప్రకటన వెనుక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం..
Also Read : రామరాజు ఇంట దీపావళి పూజ.. ధీరజ్ ప్రేమ గొడవ.. పోలీసుల ఎంట్రీ.. ప్రేమ కన్నీళ్లు..
సల్మాన్ ఖాన్ ను పాక్ ఉగ్రవాదిగా ముద్ర వెయ్యడానికి కారణం ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ ‘ఆజాద్ బలూచిస్తాన్ ఫెసిలిటేటర్’ అని అందులో ఉన్నట్లు సమాచారం. 4వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల నిఘా పెరగడం, వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నిజానికి అబుదాబిలోని రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరమ్ 2025లో సల్మాన్ ఖాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్‌లను వేర్వేరుగా అనడంతోనే ఆయన పై ఉగ్రవాది ముద్ర వేశారని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ చేస్తున్న సినిమాలు కన్నా ఆయనపై వస్తున్న వివాదాలే ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆయన పేరు వినిపించడంపై అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఇలా ఉగ్రవాదిగా ముద్ర వేయడంతో బాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. మరి దీనిపై సల్మాన్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతారో..? పాకిస్తాన్ కి ఎలాంటి కౌంటర్ ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది..
సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్తాన్..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం
ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో బలూచిస్తాన్ గురించి సల్మాన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం
ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బలూచిస్తాన్, పాకిస్తాన్… pic.twitter.com/VFbO0BlheO
— BIG TV Breaking News (@bigtvtelugu) October 26, 2025