The Ashes 2025: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ (Australia vs England, 1st Test) మధ్య త్వరలోనే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నవంబర్ 21వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. గతంలో జరిగిన టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేదికగా జరగగా, ఈసారి జరగబోయే టోర్నమెంట్ ఆస్ట్రేలియా గడ్డపై నిర్వహిస్తున్నారు. యాసెస్ సిరీస్ 2025 – 2026 (The Ashes, 2025-26) త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదటి టెస్ట్ కు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ ( PAT CUMMINS ) దూరం కాబోతున్నాడు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న ప్యాట్ కమ్మిన్స్… పెర్త్ వేదికగా జరిగే మొదటి టెస్ట్ కు దూరం కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గబ్బా టెస్టుకు మాత్రం ప్యాట్ కమ్మిన్స్ అందుబాటులోకి వస్తాడు. ప్యాట్ కమ్మిన్స్ దూరమవుతున్న నేపథ్యంలో మొదటి టెస్ట్ కు స్టీవ్ స్మిత్ కెప్టెన్ కాబోతున్నాడు.
యాషెస్ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. కచ్చితంగా యాషెస్ సిరీస్ కు మొదటి నుంచి అందుబాటులో ఉంటాడుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ ( PAT CUMMINS ) ఫస్ట్ టెస్టుకే దూరం అవుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాలో కొత్త టెన్షన్ మొదలైంది. లోయర్ బ్యాక్ పెయిన్ కారణంగా యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్ కు ప్యాట్ కమ్మిన్స్ దూరం అవుతున్నాడు. అయితే, రెండో టెస్ట్ నుంచి మాత్రం జట్టులోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ సమయంలో కెప్టెన్సీ కూడా తీసుకుంటాడు. అయితే, యాషెస్ సిరీస్ మొదటి టెస్ట్ కు ప్యాట్ కమ్మిన్స్ ( PAT CUMMINS ) దూరం అవుతున్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్ అవుతున్నాడు.
యాసెస్ సిరీస్ 2025 – 2026 (The Ashes, 2025-26) లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ సిరీస్ నవంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జనవరి 8వ తేదీ వరకు అంటే దాదాపు నెల రోజులపాటు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 21వ తేదీన ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 4వ తేదీన గబ్బ వేదికగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి అటిలైట్ వేదికగా మూడవ టెస్ట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ ఉంటుంది. జనవరి 4వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఫైనల్ టెస్ట్ ఉంటుంది.
🚨 PAT CUMMINS RULED OUT OF THE FIRET ASHES TEST Vs ENGLAND AT PERTH 🚨 pic.twitter.com/NJGUOOikAM
— Tanuj (@ImTanujSingh) October 27, 2025