BigTV English
Advertisement

Bigg Boss Buzzz : రీతూ పై రమ్య షాకింగ్ కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ..

Bigg Boss Buzzz : రీతూ పై రమ్య షాకింగ్ కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ..

Bigg Boss Buzzz : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి ఆరు వారాలు అనుకున్నట్లుగానే కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. కానీ ఏడో వారం మాత్రం ఎవరు ఊహించని విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. దాంతో పాటుగా రమ్య మోక్ష వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యింది. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చిన ఈయన శివాజీ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ బజ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని తాజాగా విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


రమ్య వీడియోను బయటపెట్టిన శివాజీ..

టాలీవుడ్ నటుడు శివాజీ బిగ్ బాస్ షో కి సంబంధించిన బిగ్ బాస్ బజ్ కి హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంటు ఈ షోలో పాల్గొని హౌస్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెడుతూ వస్తున్నారు. తాజాగా అలేఖ్య చిట్టి పీకేల్స్ రమ్య ఆ షోకి వచ్చారు. వచ్చి రాగానే శివాజీ చప్పట్లతో రమ్యకు కౌంటర్ ఇచ్చాడు. ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు మన గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి కదా అని రమ్యకు నోరు మూసుకొనేలా చేశాడు. రీతు పవన్ లవ్ లో ఉన్నారన్న సంగతి వాళ్ళిద్దరూ నీకు చెప్పారా అని శివాజీ అడిగాడు. నాకు అలా కనిపించింది అది చెప్పాను అని రమ్య అంటుంది.. ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడటం తప్పు కదా.. బయట అదే ముద్ర పడిపోతుంది కదా అని రమ్యకు క్లాస్ పీకుతాడు. మరి నీకు హౌస్ లో ఎవరంటే ఇష్టం నీ లవ్ ట్రాక్ గురించి చెప్పు అని అడుగుతాడు. నీకు ఒక వీడియో చూపిస్తాను చూడు అని పవన్, రమ్య ఉన్న వీడియో క్లిప్ చూపిస్తాడు. నాకు హౌస్ లో అందరికన్నా ఎక్కువ ఇష్టం ఇతనే అని తన మనసులోని మాటను బయట పెట్టేస్తుంది రమ్య. దాన్ని చూపించిన శివాజీ ఇది పులిహోర కలపడం కాదా అని అంటాడు.. శివాజీ మాటలతో రమ్యకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది..

Also Read: సల్లూ భాయ్ పై కక్ష్య కట్టిన పాక్.. ఉగ్రవాదిగా ప్రకటన..


రీతూ పై షాకింగ్ కామెంట్స్..

శివాజీ రమ్యను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ వస్తాడు. హౌస్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ కదా నేను కొన్ని జంతువులను చూపిస్తాను. అవి ఎవరికి కరెక్ట్ గా సూట్ అయితాయో అని అడుగుతాడు.. ఒక్కొక్కరిది చెప్తూ రీతూ చౌదిరిపై షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. నువ్వేమైనా ఓదార్పు యాత్రకు వెళ్ళావా..? నీకు ఎలా తెలుసు అన్ని.? బయట ఎవరి టాకీ ఎలా ఉంటుందో తెలుసుకునే వెళ్ళావా అని శివాజీ అంటాడు. రీతూ గురించి నువ్వు చేసిన కామెంట్స్ జనాలకు ఎంతగా రియాక్ట్ అయ్యాయో తెలుసా అని సీరియస్ అవుతాడు. బయట ఉన్నప్పుడు నీ గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ హౌస్ లో మాత్రం నువ్వే నెగటివ్ అని అర్థం అయిపోతుంది అని మొహాన్ని చెప్పేస్తాడు శివాజీ.. దాంతో పచ్చళ్ళ పాప మొహం మాడిపోతుంది. మొత్తానికి అయితే శివాజీ రమ్యను ఒక ఆట ఆడుకుంటాడు. జీవితంలో ఎక్కడా లేనివిధంగా గుణపాఠం చెప్తాడు. ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్లో ఎన్ని ప్రశ్నలు వేసి రమ్య చేత మూడు చెరువుల నీళ్లు తాగించాడో తెలుసుకోవాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Bigg Boss 9: పాపం పచ్చళ్ల పాప.. ఎన్ని కలలు కంది.. ఈ ట్రోల్స్ ఎక్కడ చూడలేదు భయ్యా!

Bigg Boss 9 Trolls: ఇదెక్కడి రోస్ట్ మామా.. ఏకంగా పెళ్లి కూడా చేసేసారుగా?

Bigg Boss 9 Promo: తలరాతను మార్చే టైమ్.. హౌస్ లోకి మాజీలు.. ఎవరెవరంటే?

Bigg Boss 9 : ట్విస్ట్లుతో రమ్య ఎలిమినేషన్, మరోసారి ఎవరు ఎలాంటి వాళ్ళు తేల్చి చెప్పేసింది. 

Ramya Moksha: మాదే మిస్టేక్, నచ్చిన ఫుడ్ పెడుతున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది రెండు వారాల్లో బయటకు తగిలేస్తారని

Bigg Boss 9 : ఏమి మేనేజ్మెంట్ సామీ, కంప్లీట్ సపోర్ట్ అంతా తనూజ కేనా?

Bigg Boss 9 Promo: పచ్చళ్ల పాపకి ఆ మాత్రం కూడా తెలీదా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Big Stories

×