Illu Illalu Pillalu Today Episode October 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు తెచ్చిన బట్టలను తన కొడుకులు నచ్చాయని చెప్పడంతో తిరుపతి బొమ్మరిల్లు సీన్ చూపిస్తాడు. ముగ్గురు కోడళ్ళు కూడా కొడుకులు చేస్తున్న సీన్ చూసి నవ్వుకుంటారు.. తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్ తిరుపతి కోరస్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక కోడళ్ళకు వేదవతి చీరలు తెచ్చి ఇస్తుంది. ముగ్గురు కోడలు మా అత్తయ్య బంగారం అంటూ మెచ్చుకొని ఆ చీరల్ని కట్టుకొని వస్తామని అంటారు.. ఇంట్లో దీపావళి పూజ చేయాలి ముగ్గురు కోడలు కొడుకులు రావాలి అని పంతులుగారు పిలుస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ముగ్గురు కొడుకులు కోడలు అత్తమామలు తెచ్చిన బట్టలను కట్టుకొని పూజకు వస్తారు. ముగ్గురు కొడుకులు కి తాను తెచ్చిన బట్టలు బాగా సూట్ అయ్యాయి అని రామరాజు సంబరపడిపోతూ ఉంటాడు.. ఈ కలరు ఈ డ్రెస్సు నీకు బాగా సెట్ అయ్యారా అని ముగ్గురి కొడుకులు చూసి మెచ్చుకుంటారు. ఇక ఒక్కొక్క జంట ఒక్కొక్కసారి వచ్చి పూజలో పీటల మీద కూర్చుంటారు.. వేదవతి రామరాజు తన ముగ్గురు కొడుకులను కోడలను చూసి మూడు జంటలు చూడముచ్చటగా ఉన్నారు.. వీళ్ళని చూస్తూ ఉంటే నా కళ్ళు చల్లబడిపోతున్నాయి. అనకూడదు కానీ నా ముగ్గురు కోడలు కొడుకులు ఎంత అందంగా ఉన్నారో చూడముచ్చటగా ఉన్నారు అని వేదవతి తెగ సంబరపడిపోతూ కొడుకులు కోడళ్ల పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది..
అందరూ సరదాగా కూర్చుని లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తొందరగా ప్రేమ బ్లౌజ్ కున్న దారం ధీరజ్ చొక్కాకు ఉన్న గుండీకి తగులుకుంటుంది.. ఏంటే కావాలని తగిలిస్తున్నావా అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఆ అవును కావాలనే తగిలించను నిన్ను ఆనుకొని రాసుకుంటూ పూసుకుంటూ పూజ చేస్తే బాగుంటుందని అని వెటకారంగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరి బాధని చూసి నన్ను నర్మదా వేసిన ముడి అంత త్వరగా విడిపోదు అని అంటుంది. మొత్తానికి ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ ఉందని దేవుడు సాక్షిగా రుజువు అవుతుంది.
మా నాన్న ఎంతో ప్రేమగా తెచ్చిన చొక్కా చినిగిపోయింది. ఏదో ఒకటి మేనేజ్ చెయ్ నేను ఇప్పుడే వస్తానని ధీరజ్ లోపలికి వెళ్ళిపోతాడు. ప్రేమ కూడా ధీరజ్ వెనకాల వెళ్లిపోవడంతో రామరాజు ఏమైంది వీళ్లిద్దరికి పూజలోంచి అలా వెళ్ళిపోయారు ఏంటి అని అడుగుతాడు. ముఖ్యమైన అర్జెంటు పని ఉంటది లేండి అందుకే వెళ్లింటారు. వస్తారులేండి అని వేదవతి. ఒకవైపు పూజ జరుగుతూ ఉండగ.. ధీరజ్ కోసమని పోలీసులు అక్కడికొస్తారు.. దీరజ్ ఎవరు అని అడుగుతారు.. నేనే సార్ ఏంటి ప్రాబ్లం చెప్పండి అని ధీరజ్ అంటాడు. ఏం లేదు నిన్న ఒక అమ్మాయిని మీరు క్యాబ్ ఎక్కించుకున్నారు కదా.. ఆ అమ్మాయి మిస్సయింది. వాళ్ల నాన్న క్యాబ్ డ్రైవర్ నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారమే మేము ఇక్కడికి వచ్చేసాము.
Also Read : చక్రధర్ కు షాకిచ్చిన కమల్.. పల్లవికి క్లాస్ పీకిన పార్వతి.. అక్షయ్ కు అవని సపోర్ట్..
మీరు మాకు కోఆపరేట్ చేయాలి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి అని ధీరజ్ని తీసుకుని వెళ్తారు. వెనకాల రామరాజు తో పాటు మిగిలిన వాళ్ళందరూ మా అబ్బాయి అలాంటివాడు కాదండి. ఎక్కడో ఏదో జరిగింది అమ్మాయిని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారేమో అని అంటూ వస్తారు.. ధీరజ్ కోసం పోలీసులు ఎందుకు వచ్చారు అని భద్రావతి సేన అనుకుంటారు.. మీ కొడుకు ఏదో ఒక తప్పు పని చేసి ఉంటాడు అందుకే వాళ్ళు వచ్చారు తీసుకొని వెళ్లారు అని గొడవకు దిగుతారు. అయితే ప్రేమ ధీరజ్ గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని అందరినీ తిడుతుంది. తన పెళ్లి గురించి అసలు నిజాన్ని చెప్పాలని అనుకుంటుంది. నర్మదా మధ్యలోనే ఆపేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ధీరజ్ కోసం ప్రేమ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..