CMR Row: ప్రభుత్వ ధాన్యం.. ప్రభుత్వ లెక్క.. మరి మిల్లర్ల మాటే ఫైనలా? తెలంగాణలో CMR వ్యవహారం మరోసారి హీట్ పెంచుతోంది. తనిఖీలను వ్యతిరేకిస్తున్న మిల్లర్లు.. మిల్లింగ్ నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. 67 శాతం బియ్యం ఇవ్వడం సాధ్యం కాదంటున్నారన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. అయితే మరోవైపు అధికారులు చేపట్టిన తనిఖీల్లో తీవ్ర అక్రమాలు బయటపడుతున్నాయ్. 89 మిల్లుల్లో 3.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయ్. దీని విలువ 927 కోట్లకు పైగానే. 28 క్రిమినల్ కేసులు నమోదు చేసి.. 700 కోట్లకు పైగా రికవరీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనిఖీలనే ఆపాలంటూ ఒత్తిడి చేయడం కీ డిబేట్ గా మారింది. నిజంగా మిల్లింగ్‌లో సాంకేతిక సమస్యలుంటే ప్రభుత్వం ముందు పెట్టొచ్చు. కానీ ఇలాంటి టైంలో మిల్లింగ్ బంద్ హెచ్చరికలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నమా?