E-Paper
Advertisement

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?
Advertisement

Sony vs Bose Headphones: రోజూ ఆఫీసుకి వెళ్లేటప్పుడో లేదంటే దూరపు ప్రయాణాలు చేసేవారికి పాటలు వినేటప్పుడు చుట్టుపక్కల శబ్దాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే.. మంచి నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ ఉండాల్సిందే. మార్కెట్లో ఇందుకు సంబంధించి సోనీ, బోస్ బ్రాండ్లు రెండూ ఎప్పటి నుంచో టాప్‌లో ఉన్నాయి. ప్రస్తుతం సోనీ WH-1000XM4తో పాటు బోస్ క్వైట్ కంఫర్ట్ అల్ట్రా సెకండ్ జనరేషన్ హెడ్‌ఫోన్స్ కూడా ఉన్నాయి. అయితే సోనీ నుంచి లేటెస్ట్ XM6 మోడల్ మార్కెట్లోకి వచ్చినందున.. దానితో బోస్ హెడ్‌ఫోన్స్‌ను పోల్చి చూస్తే ఏది బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌండ్ క్వాలిటీ, యాప్ ఫీచర్స్:

రెండు బ్రాండ్ల హెడ్‌ఫోన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మంచి బేస్‌తో అద్భుతమైన సౌండ్ ఇస్తాయి. రాక్, హిప్‌హాప్ మ్యూజిక్ లవర్స్‌కి ఇవి బాగా నచ్చుతాయి. అయితే సోనీ సౌండ్ కొంచెం డార్క్‌గా అనిపిస్తే.. బోస్ సౌండ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సోనీ యాప్‌లో అయితే టెన్-బ్యాండ్ ఈక్వలైజర్, లొకేషన్‌ను బట్టి ఆటోమేటిక్‌గా నాయిస్ క్యాన్సిలింగ్ మార్చే జియోలొకేషన్ వంటి అదిరిపోయే ఫీచర్లున్నాయి. బోస్‌లో కూడా యాప్ ఉన్నప్పటికీ.. ఈక్వలైజర్ కేవలం మూడు బ్యాండ్లకే పరిమితమై ఉంటుంది.

Advertisement

Also Read: రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

కంఫర్ట్, బ్యాటరీ లైఫ్:

హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అస్సలు బరువు అనిపించకుండా ఉండటంలో బోస్ హెడ్‌ఫోన్స్ ఎప్పుడూ ముందే ఉంటాయి. సోనీతో పోలిస్తే బోస్ కుషన్స్ చాలా సాఫ్ట్‌గా ఉండి, తలపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. అయితే జిమ్‌కెళ్లేవారు ఈ రెండింటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వీటికి వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లేదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. రెండు హెడ్‌ఫోన్స్ కూడా ఏఎన్‌సీ ఆన్‌లో ఉంటే దాదాపు 30 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. అంతేకాదు.. చాలా తక్కువ సేపు ఛార్జ్ చేస్తేనే గంటల తరబడి వాడే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

నాయిస్ క్యాన్సిలింగ్, కాల్స్:

Advertisement

బయటి నుంచి వచ్చే శబ్దాలను పూర్తిగా కట్ చేయడంలో సోనీ, బోస్ రెండూ అద్భుతమే. అయితే అన్ని రకాల ఫ్రీక్వెన్సీల శబ్దాలను ఆపడంలో సోనీ XM6 కొంచెం ముందుంది. అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఎదుటివారికి క్లియర్ వాయిస్ వినిపించే విషయంలో కూడా సోనీదే పైచేయి అని చెప్పవచ్చు.

ధరల విషయానికొస్తే..

ప్రస్తుతం సోనీ WH-1000XM6 సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉండగా.. బోస్ క్వైట్ కంఫర్ట్ అల్ట్రా కూడా దాదాపు అదే రేంజ్‌లో లభిస్తున్నాయి. రెండు బ్రాండ్ల హెడ్‌ఫోన్స్ చాలా బాగున్నప్పటికీ, సౌండ్ కస్టమైజేషన్, బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్, కాల్ క్వాలిటీ పరంగా చూస్తే సోనీ WH-1000XM6నే తీసుకోవడం చాలా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

Tags

Related News

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!

సైబర్ ఫ్రాడ్‌లో డబ్బు పోయిందా? ప్రభుత్వ పోర్టల్‌లో ఇలా రిఫండ్ కోసం అప్లై చేసుకోండి!

Big Stories

Advertisement
×