Shoaib Akhtar On Fixing: పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటేనే ఫిక్సింగ్ కేరాఫ్ అడ్రస్. అలాంటిది ఫిక్సింగ్ కుట్రకు తెర లేపిన ఓ వ్యక్తిని చితకబాదినట్లు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar On Fixing) సంచలన ఆరోపణలు చేశారు. తనను కొనుగోలు చేసేందుకు వచ్చిన ఆ వెధవను.. హోటల్ రూమ్ లోనే చితకబాదినట్లు తాజాగా వెల్లడించారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ జట్టులో షోయబ్ అక్తర్ ఒకప్పుడు తోపు బౌలర్ అన్న సంగతి తెలిసిందే. ఒక్కో బంతి 160 స్పీడ్ తో వేయగల గనుడు అక్తర్. తన మొదటి స్పెల్ లోనే కనీసం మూడు వికెట్లు తీయగల మొనగాడు. అందుకే షోయబ్ అక్తర్ బౌలింగ్ అంటే ప్రత్యర్ధులు వణికి పోతారు. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లు కూడా అతడిని ఎదుర్కోవాలంటే… ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అలాంటి షోయబ్ అక్తర్… ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఓ వ్యక్తి ఫిక్సింగ్ కు కుట్రకు లేపినట్లు తాజాగా వెల్లడించారు. తనను కొనుగోలు చేసేందుకు ఒక బుకీ ప్రయత్నించాడని.. చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా తాను హోటల్ రూమ్ లో ఉండగా… సదరు బుకీ వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో తనకు కోట్లల్లో డబ్బులతో పాటు అపార్ట్మెంట్ కూడా ఆఫర్ చేశాడని వివరించారు. ఒకే ఒక్క మ్యాచ్ తమకు అనుకూలంగా వ్యవహరించాలని.. తనను ప్రలోభాలకు గురి చేశాడని స్పష్టం చేశారు షోయబ్ అక్తర్. ఇక ఆ ఆఫర్ చూస్తే తాను టెంప్ట్ అయిపోయానని కూడా గుర్తు చేశారు షోయబ్ అక్తర్. కానీ ఆ తర్వాత రియలైజ్ అయి…. సదరు వ్యక్తిని తన రూమ్ లోనే లాక్ వేసి చితక బాదినట్లు వివరించారు. తాను కొట్టిన దెబ్బలను అతడు జీవితంలో మర్చిపోకుండా కొట్టినట్లు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే ఈ ఫిక్సింగ్ ఇన్సిడెంట్ పైన షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ అభిమానులు… ఈ విషయంలో షోయబ్ అక్తర్ ను తెగ మెచ్చుకుంటున్నారు. కోట్లలో డబ్బులు అలాగే అపార్ట్మెంట్ ఆఫర్ వచ్చినా కూడా షోయబ్ అక్తర్ వదిలేయడం చాలా గ్రేట్ అంటున్నారు. కొంతమంది క్రికెటర్లు అయితే.. లక్ష రూపాయలు ఇచ్చిన అమ్ముడు పోతారని చురకలు అంటిస్తున్నారు. కానీ షోయబ్ అక్తర్ నిప్పులాంటి మనిషి అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇండియన్ ఫాన్స్ మాత్రం… వాడు అమ్ముడు పోయేవాడు తప్ప.. శ్రీరామచంద్రుడేం కాదని కౌంటర్లు ఇస్తున్నారు.