E-Paper
Advertisement

యూట్యూబ్ యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్ మీ కోసమే!

యూట్యూబ్ యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్ మీ కోసమే!
Advertisement

YouTube Ads: ప్రస్తుత రోజుల్లో వినోదం, విజ్ఞానానికి కేరాఫ్ గా యూట్యూబ్ మారిపోయింది. అయితే యూట్యూబ్ లో వీడియోను చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే ప్రకటనలు చికాకు తెప్పిస్తుంటాయి. నిజానికి ఉచితంగా అందించే కంటెంట్ క్రియేటర్లకు ఆదాయాన్ని సమకూర్చేందుకు యూట్యూబ్ ఈ యాడ్స్ ను ఇస్తుంది. అందుకే ఒక వీడియోను వీక్షించేటప్పుడు పదే పదే యాడ్స్ వస్తుంటాయి. అయితే ఈ ప్రకటన బాధ నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

5 సెకన్ల రూల్

యూట్యూబ్‌లో వచ్చే చాలా ప్రకటనలు చిన్నవిగానే ఉంటాయి. 15 సెకన్ల కంటే తక్కువ ఉన్న యాడ్స్‌ను 5 సెకన్ల తర్వాత స్కిప్ (Skip) చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 5 సెకన్లు ఓపిక పడితే సులభంగా యాడ్‌ను తప్పించుకోవచ్చు.

యాడ్స్‌ను రిపోర్ట్ చేయండి

Advertisement

ఏదైనా ఒక నిర్దిష్ట ప్రకటన పదే పదే కనిపిస్తూ విసుగు కలిగిస్తుంటే.. దానిని ‘రిపోర్ట్’ చేయవచ్చు. వీడియో పైన కనిపించే ‘Report this ad’ ఆప్షన్ క్లిక్ చేసి.. అక్కడ ఉన్న రీజన్స్ లో ఒకదాన్ని క్లిక్ చేస్తే.. మరోమారు ఆ యాడ్ కనిపించదు. అయితే ఈ చిట్కా.. కేవలం ఒక్క యాడ్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇతర ప్రకటనలు యథావిధిగా వచ్చే ఛాన్స్ ఉంది.

బ్రౌజర్‌ను మార్చండి

గూగుల్, గ్రోమ్ వంటి రెగ్యులర్ గా వాడే బ్రౌజర్లలో యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అదే ఓపెరా వంటి ఇతర ప్రత్యేక బ్రౌజర్లలో అంత ఎక్కువ స్థాయిలో యాడ్స్ రావని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఫైర్‌ఫాక్స్ (Firefox) వంటి బ్రౌజర్లలో యాడ్-బ్లాకింగ్ ఎక్స్‌టెన్షన్స్ వాడుకోవడం ద్వారా కూడా కొంత ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: వీఐ ‘ఇన్‌స్టాడేటా’ ఆఫర్.. ఫ్రీగా 1GB ఎమర్జెన్సీ డేటా.. కానీ ఒక షరతు!

యూట్యూబ్ ప్రీమియం

ఎలాంటి చిట్కాలు, మార్గాలతో పనిలేకుండా యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిషన్ తో యాడ్స్ ను అడ్డుకోవచ్చు. నిర్ణీత నెలవారీ రుసుము చెల్లించడం ద్వారా ఎలాంటి ప్రకటనలు లేకుండా వీడియోలు చూడవచ్చు. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లకు కూడా మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

Also Read: నింగికి నిచ్చెన వేసిన తెలుగు శాస్త్రవేత్తలు.. ‘స్కైరూట్’ సృష్టికర్తల సక్సెస్ స్టోరీ!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×