E-Paper
Advertisement

Home Wi-Fi Tips: పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. Wi-Fi స్పీడ్‌ను పెంచుకోవచ్చు, అదెలాగంటే?

Home Wi-Fi Tips: పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. Wi-Fi స్పీడ్‌ను పెంచుకోవచ్చు, అదెలాగంటే?
Advertisement

Home Wi-Fi Tips: సాధారణంగా ఇంట్లో వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్లకైనా, ఆన్‌లైన్ క్లాసులు వినేవాళ్లకైనా వై-ఫై సిగ్నల్ ప్రాబ్లం అనేది పెద్ద తలనొప్పిగా ఉంటుంది. హాల్లో కూర్చున్నప్పుడు ఫుల్ స్పీడ్‌గా వచ్చే నెట్, రూమ్‌లోకి వెళ్లేసరికి స్లో అయిపోవడం లేదా అసలు రాకపోవడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో వై-ఫై ఎక్స్‌టెండర్లు లేదా మెష్ సిస్టమ్స్ వంటి కొత్త పరికరాలు కొనడం కంటే, మీ ఇంట్లో ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుకోవడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా వై-ఫై సిగ్నల్‌ను పెంచుకోవచ్చు. అది ఎలాగనే కదా మీ సందేహం? రండి.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోన్‌ను వై-ఫైకి కనెక్ట్ చేయాలి..

మీ పాత ఫోన్‌ను ఆన్ చేసి, ఇంట్లో ఉన్న మెయిన్ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి. దీనికోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇంటర్నెట్ ఆప్షన్ ద్వారా మీ వై-ఫై పాస్‌వర్డ్‌తో కనెక్ట్ చేసుకోండి. ఇది మీ ఫోన్‌కు ఇంటర్నెట్ అందేలా చేస్తుంది.

హాట్‌స్పాట్ ఆన్ చేయాలి..

Advertisement

ఇప్పుడు అదే ఫోన్‌లో వై-ఫై హాట్‌స్పాట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. సాధారణంగా సెట్టింగ్స్‌లో నెట్‌వర్క్, ఇంటర్నెట్ విభాగంలో ఇది ఉంటుంది. శాంసంగ్ ఫోన్లలో అయితే కనెక్షన్స్ మెనూలో మొబైల్ హాట్‌స్పాట్ అని కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా మీ ఫోన్ ఒక వై-ఫై ఎక్స్‌టెండర్‌లా మారి సిగ్నల్‌ను రీ బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది.

Also Read: గోల్డెన్ ఛాన్స్ మావా.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై రూ.24వేల తగ్గింపు!

పాస్‌వర్డ్ సెట్ చేసుకోండి..

Advertisement

హాట్‌స్పాట్‌కు మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు: మీ మెయిన్ వై-ఫై పేరు ‘హోమ్ నెట్’ అయితే.. దీనికి ‘హోమ్ నెట్ ఎక్స్‌టెన్షన్’ అని పేరు ఇచ్చుకుంటే గుర్తుపట్టడం చాలా సులభం. అలాగే మీ వై-ఫైని ఎవరూ వాడకుండా ఉండటానికి కూడా ఒక బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడం మర్చిపోకండి.

సిమ్ డేటాను ఆఫ్ చేయాలి..

ఒకవేళ మీ పాత ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉంటే, మొబైల్ డేటాను పూర్తిగా ఆపేయండి. ఎందుకంటే.. ఫోన్ వై-ఫై ద్వారా కాకుండా సిమ్ డేటా ద్వారా ఇంటర్నెట్ షేర్ చేస్తే మీ ప్లాన్ ఖర్చయ్యే ప్రమాదం ఉంది. వీలైతే సిమ్ కార్డును తీసేస్తే ఇంకా మంచిది.

ఫోన్ పెట్టే ప్లేస్ ముఖ్యం..

ఫోన్‌ను ఎక్కడ ఉంచుతారనేదే ఇక్కడ కీలకం. సిగ్నల్ రాని డెడ్ జోన్‌లో కాకుండా, రూటర్‌కు, డెడ్ జోన్‌కు మధ్యలో ఫోన్‌ను ఉంచాలి. అప్పుడే అది రూటర్ నుంచి సిగ్నల్ అందుకుని ఇంట్లో ఏ మూలకైనా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పంపగలదు. అలాగే హాట్‌స్పాట్ వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది కాబట్టి.. ఆ ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచడం ఉత్తమం.

Also Read: స్మార్ట్ రింగ్ vs స్మార్ట్ వాచ్.. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు ఏది బెస్ట్ ఆప్షన్!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×