E-Paper
Advertisement

Nutricook Smart Pot: ఒక్క కుక్కర్‌తో 9 రకాల వంటలు.. రైస్, కర్రీ, బిర్యానీ, కేక్స్ ఇలా అన్నీ క్షణాల్లోనే !

Nutricook Smart Pot: ఒక్క కుక్కర్‌తో 9 రకాల వంటలు.. రైస్, కర్రీ, బిర్యానీ, కేక్స్ ఇలా అన్నీ క్షణాల్లోనే !
Advertisement

Nutricook Smart Pot: ప్రస్తుతం బిజీ లైఫ్‌లో వంట చేసుకోవడం చాలా మందికి పెద్ద పని అయిపోయింది. ఆఫీస్, చదువు, ఇంటి పనుల మధ్య సమయం కుదరడం కష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఒకే కుక్కర్‌తో అన్నీ వండుకునే సౌకర్యం ఉంటే.. ఎంత బాగుంటుంది? కదా.. ఇందుకోసం Nutricook Smart Pot 2 6 Liters 9 in 1 ఎలక్రిక్ కుక్కర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక మల్టీ-ఫంక్షన్ కుక్కర్, అంటే రైస్ నుంచి కర్రీ వరకు, స్టీమ్ నుంచి సూప్ వరకు అన్నీ ఒకే డివైస్‌లో చేయొచ్చు. సింపుల్‌గా, సేఫ్‌గా వంట చేయాలనుకునేవారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్.

ఈ కుక్కర్ ఒక లేటెస్ట్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. ఇది ఒకేసారి 9 రకాల వంటలను చేయగలదు. వేర్వేరు పాత్రలు, గ్యాస్ స్టౌ అవసరం లేకుండా ఒకే డివైస్‌తో వంట పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం లేటెస్ట్ కిచెన్‌లలో ఇది చాలా ఉపయోగపడే గ్యాడ్జెట్‌గా మారింది.

Advertisement

బెస్ట్ ఫీచర్లు:

ఈ కుక్కర్‌లో 9-in-1 ఫంక్షన్స్ ఉంటాయి. రైస్, దాల్, కర్రీ, సూప్, స్టీమ్, సాటే, యోగర్ట్, స్లో కుక్, ప్రెషర్ కుక్ ఇలా అన్ని ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. 6 లీటర్ కెపాసిటీ ఉండటం వల్ల చిన్న ఫ్యామిలీ నుంచి 5–6 మంది వరకు సులభంగా వంట చేయొచ్చు. వన్ టచ్ ఆపరేషన్ వల్ల బటన్ నొక్కితే చాలు.. కుక్కర్ ఆటోమేటిక్‌గా వంట పూర్తి చేస్తుంది. అదనంగా.. ఓవర్‌హీట్ ప్రొటెక్షన్, ప్రెషర్ కంట్రోల్, ఆటో షట్‌డౌన్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉండటం దీని స్పెషాలిటీ.

Advertisement

ఈ కుక్కర్ వాడటం చాలా ఈజీ. కొత్తగా వాడే వాళ్లకైనా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఉదాహరణకు రైస్ వండాలంటే.. బియ్యం, నీళ్లు వేసి “Rice” మోడ్ సెలెక్ట్ చేస్తే సరి పోతుంది. మిగతా పని కుక్కర్ తానే చేసేస్తుంది. అలాగే పప్పుతో పాటు వివిధ కర్రీలను కూడా  దీనిలో సింపుల్ చేసుకోవచ్చు. గ్యాస్ దగ్గర నిలబడి చూడాల్సిన అవసరం లేకుండా టైమ్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది.

ఎవరికి ఉపయోగపడుతుంది?
ఈ కుక్కర్ ముఖ్యంగా ఉద్యోగులు, బ్యాచిలర్స్, స్టూడెంట్స్, చిన్న ఫ్యామిలీలకు  చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ వంటలో టైమ్ సేవ్ చేయాలనుకునే.. వాళ్లకు ఇది మంచి ఆప్షన్. హాస్టల్ లేదా రూమ్‌లో వాడాలనుకునే వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

Also Read: చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఫ్రిజ్ ..ఈ ధరలో అస్సలు మిస్సవ్వొద్దు

లాభాలు:
ఈ కుక్కర్‌తో ఒకే డివైస్‌లో అన్ని వంటలు చేయవచ్చు. టైమ్ , ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. గ్యాస్ అవసరం కూడా దీనికి ఉండదు. అయితే కరెంట్ లేకపోతే.. మాత్రం దీనిని వాడలేరు. కానీ మొదట్లో సెట్టింగ్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది.

కొనాలా లేదా?
మీరు వంటలో టైమ్ సేవ్ చేయాలని.. సింపుల్‌గా కుక్ చేయాలని అనుకుంటే.. ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ బెస్ట్. ఇది ఒక ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ లాంటిది. ముఖ్యంగా.. బిజీ లైఫ్‌స్టైల్ ఉన్న వాళ్లకు, గ్యాస్ మీద ఆధారపడకుండా వంట చేయాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

Related News

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!

స్లిమ్ లుక్‌తో అదరగొడుతున్న Samsung Galaxy S26 FE.. భారత్‌లో దీని ధరెంతంటే?

రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!

బరువు తగ్గడం ఇక ఈజీ.. ఒప్పో నుంచి అధునాతన ‘ఫ్యాట్ బర్నింగ్ వాచ్’ వచ్చేస్తోంది!

యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!

Big Stories

Advertisement
×