E-Paper
Advertisement

Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ 2.0 అప్‌డేట్ వెర్షన్.. ప్రూఫ్‌ బయటపెట్టన ఇరాన్‌, మళ్లీ వేట షురూ

Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ 2.0 అప్‌డేట్ వెర్షన్..  ప్రూఫ్‌ బయటపెట్టన ఇరాన్‌, మళ్లీ వేట షురూ
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్‌లో కీలక నేతలను మట్టుబెట్టాం.. ఇప్పుడు అక్కడ పాలకులు ఎవరు ఉన్నారో తెలీదు, ఆ దేశం కోలుకోవాలంటే పదేళ్లు పడుతుందని మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాట. ఇజ్రాయెల్ కూడా అమెరికా మాటలను చెబుతోంది. ఇరాన్ నేతలు, కీలక స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పింది ఇజ్రాయెల్.  ఎక్కడున్నా వేటాడుతామని చెప్పింది. ఆ రెండు దేశాలు చేస్తున్న ఆరోపణలను తిప్పుకొట్టే ప్రయత్నం చేసింది ఇరాన్. తాజాగా కొత్త సుప్రీం మొజ్తాబా ఖమేనీ వీడియో విడుదల చేసింది ఇరాన్.

ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తాబా ఖమేనీ 2.0 అప్‌డేట్ వెర్షన్

Advertisement

ఇరాన్‌ కొత్త సుప్రీం మొజ్తాబా ఖమేనీ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. తొలి రోజు ఆదేశ కీలక నేతల్లో ఆయన కూడా మరణించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని తిప్పికొడుతూ ఆ దేశం మొజ్తాబా పేరిట ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన ఆడియో మాత్రమే ఉంది. తాజాగా ఇరాన్‌ అధికారిక మీడియా ఐఆర్‌ఐబీలో మొజ్తాబా ఖమేనీ వీడియో బయటపెట్టింది.

ఇరాన్ విడుదల చేసిన వీడియోలో మొజ్తాబా ఖమేనీ కొంతమందికి మత పెద్దలతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ఎప్పటిది అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. మొజ్తబా పాత వీడియోల ఫుటేజీ వాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  అయితుల్లా అలీ ఖమేని మాత్రమే ఆ సీటులో కూర్చొంటారని అంటున్నారు. మొజ్తాబా వ్యవహారం వెలుగులోకి రాగానే అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అటు వైపు దృష్టి పెట్టాయి.

Advertisement

మొజ్తాబా ప్రూఫ్‌ బయటపెట్టన ఇరాన్‌.. మళ్లీ వేట షురూ చేసిన నిఘా వర్గాలు

అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడుల మొజ్తాబా బయట ప్రపంచానికి కనిపించడం తొలిసారి. సుప్రీం నేతగా ఎన్నికైనప్పుడు ఆయన బయటకు కనిపించలేదు. దీంతో ఆయన ఉన్నారా? లేదా అనే ఊహాగానాలు రెట్టింపు అయ్యాయి.  మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఆ వీడియోపై  ఫోకస్ చేశారు. తమ వేగుల ద్వారా ఆ వీడియో ఎప్పుటిది?  మొజ్తాబా బతికే ఉన్నారా? లేదా అనేదానిపై ఆరా తీయడం మొదలు పెట్టాయి.

ఇక మొజ్తాబా ఖమేనీ వీడియో వెలుగులోకి రాగానే గల్ప్ దేశాల నేతల్లో కాస్త వణుకు మొదలైంది. ఎందుకంటే మిగతా దేశాల కంటే మొజ్తాబా గురించి గల్ఫ్ దేశాధి నేతలకు తెలిసినట్టు ఎవరూ తెలీదు. అతడు ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండడం ఖాయమని చర్చ గల్ఫ్ మీడియాలో లేకపోలేదు. మొత్తానికి మొజ్తాబా ఖమేనీ వీడియోపై రెండువైపులా వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ALSO READ: తుపుక్ తుపుక్ వ్యవహారం.. లండన్‌లో బుక్కైన ఇద్దరు భారతీయులు

 

https://twitter.com/iribnews_irib/status/2034767962612125707

 

 

 

 

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×