E-Paper
Advertisement

Huawei Band 11: ఫిట్‌నెస్ ట్రాకర్లతో కొత్త బ్యాండ్స్ లాంచ్ చేసిన హవాయ్.. 14 రోజుల బ్యాటరీ, ఆమోలెడ్ డిస్‌ప్లే ఇంకా

Huawei Band 11: ఫిట్‌నెస్ ట్రాకర్లతో కొత్త బ్యాండ్స్ లాంచ్ చేసిన హవాయ్.. 14 రోజుల బ్యాటరీ, ఆమోలెడ్ డిస్‌ప్లే ఇంకా
Advertisement

Huawei Band 11 Pro| హవాయ్ కంపెనీ రెండు కొత్త స్మార్ట్ బ్యాండ్‌లను తాజాగా లాంచ్ చేసింది. హవాయ్ బ్యాండ్ 11, బ్యాండ్ 11 ప్రో.. ఈ రెండు మోడల్స్‌లో చాలా ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. ఇవి స్టైలిష్ డిజైన్‌తో ఆరోగ్యం, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌ కోసం ఉపయోగపడతాయి. రోజువారీ ఉపయోగానికి ఇందులో హవాయ్ ఇందులో మెరుగైన ఫీచర్స్ ఇస్తోంది.

AMOLED డిస్‌ప్లే, డిజైన్

రెండు బ్యాండ్‌లలో 1.62 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 286 × 482 పిక్సెల్స్. ఇది 347 PPI పిక్సెల్ డెన్సిటీ ఇస్తుంది. కలర్స్ చాలా బ్రైట్‌గా, క్లియర్‌గా కనిపిస్తాయి. పూర్తి టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫిజికల్ నావిగేషన్ బటన్ కూడా ఉంది. బ్యాండ్‌లో కనిపించే మెనూల్లో నావిగేషన్ ఈ బాటన్ సులభతరం చేస్తుంది. బ్యాండ్ 11 అల్యూమినియం వెర్షన్ 17 గ్రాములు, పాలిమర్ వెర్షన్ 16 గ్రాములు మాత్రమే. బ్యాండ్ 11 ప్రో సుమారు 18 గ్రాములు. స్టాండర్డ్ మోడల్ 42.6 mm, ప్రో మోడల్ 43.5 mm సైజులో ఉంటుంది.

వాటర్ రెసిస్టెన్స్, సెన్సార్లు

Advertisement

రెండు బ్యాండ్‌లు 5ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తాయి. స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా వీటిని ధరించవచ్చు. వ్యాయమం చేసే సమయంలో నీరు పడినా భయపడాల్సిన అవసరం లేదు. 9-యాక్సిస్ IMU సెన్సార్ సిస్టమ్ ఉంది. ఇది మోషన్, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌ను కచ్చితంగా చేస్తుంది. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ ఉంది. ఆండ్రాయిడ్ 9.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఫోన్లతో, iOS 13.0 ఇంకా అప్‌గ్రేడెడ్ వెర్షన్ల డివైస్ల‌తో కనెక్ట్ అవుతాయి.

బ్యాటరీ పర్‌ఫామెన్స్

రెండు బ్యాండ్‌లలో 300mAh బ్యాటరీ ఉంది. సాధారణ ఉపయోగంలో 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. హెవీ యూజ్‌లో 8 రోజులు వస్తుంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే స్విచ్ ఆన్ చేస్తే సుమారు 3 రోజులు ఉంటుంది. రోజువారీ ఉపయోగానికి చాలా నమ్మదగిన బ్యాటరీ లైఫ్ ఉంది.

Advertisement

Also Read: బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్‌లో హానికర కెమికల్స్.. అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

ధరలు, కలర్ ఆప్షన్స్

ప్రస్తుతం ఈ బ్యాండ్స్ ఫిలిప్పీన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అక్కడ హవాయ్ బ్యాండ్ 11 ధర PHP 2,399 (భారత కరెన్సీలో దాదాపు రూ.3,700). బీజ్, గ్రీన్, వైట్, బ్లాక్, పర్పుల్ కలర్లు ఉన్నాయి. అల్యూమినియం, పాలిమర్ కేస్ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాండ్ 11 ప్రో ధర PHP 4,499 (దాదాపు రూ.7,000). గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్లలో వస్తుంది. ప్రీమియం అల్యూమినియం అల్లాయ్ కేస్ ఉంటుంది.

హవాయ్ ఈ బ్యాండ్‌లను ఫిట్‌నెస్ ప్రియుల కోసం రూపొందించింది. బ్రైట్ డిస్‌ప్లే, లైట్‌వెయిట్ డిజైన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. 5ATM వాటర్ రెసిస్టెన్స్ యాక్టివ్ యూజర్లకు చాలా ఉపయోగకరం. ప్రో వెర్షన్ కొంచెం పెద్ద సైజు, ప్రీమియం లుక్ ఇస్తుంది. రెండూ తమ ధరకు తగిన గొప్ప విలువ ఇస్తాయి.

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×