E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్, నర్మద పై అనుమానం.. శ్రీవల్లికి ప్రేమ షాక్.. వనజకు నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episode:  సాగర్, నర్మద పై అనుమానం.. శ్రీవల్లికి ప్రేమ షాక్.. వనజకు నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి సాగర్ ని పిలుస్తుంది. ఆ వనజ గారికి డబ్బులు ఇవ్వమని మీకు చెప్పారు కదా మరి అతను కొత్త జాబు మోజులో పడిపోయి మర్చిపోయినట్లున్నాడు.. మీరు అల్లుడుగారు ఎలాగో డబ్బులు విషయంపై బ్యాంకుకు వెళ్తున్నారు కదా మీరే స్వయంగా వెళ్లి ఆ డబ్బులని వాళ్లకి ఇస్తే బాగుంటుంది కదా అని భాగ్యం అంటుంది నేను ఆ డబ్బులు ఇస్తాను నాన్న అని ఎంతగా అంటున్న సరే భాగ్యం చెప్పిన మాటను విని రామరాజు పాస్ బుక్ ని అడగమని చెందులతో చెప్పాడు. పలు ఉద్యోగస్తులు కదరా మనం మూటలు మూసుకునే వాళ్ళం ఆ డబ్బులని మనమే తెచ్చి ఇద్దామని రామరాజు అంటాడు కానీ సాగర్ భయపడిపోతూ ఉంటాడు అప్పుడే సీన్లోకి ఎంటర్ అయిన నర్మదా అతనికి ఇచ్చిన బాధ్యతని అతనే పూర్తి చేస్తాడు అని రామరాజుతో అంటుంది.. అయోమయంగా ఉండడంతో శ్రీవల్లి భాగ్యంకి ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఇతను ఏమైంది కచ్చితంగా 20 లక్షలు లేనట్టే ఉన్నాయి అని వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే సాగర్ నర్మదను 20 లక్షలు ఎక్కడ నుంచి తీసుకురావాలి నాకు చాలా కంగారుగా ఉంది అని అడుగుతాడు.. మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని నర్మదా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..20 లక్షలు ఎక్కడినుంచి పెట్టాలి నాకు అర్థం కావట్లేదు అని సాగర్ అంటాడు. మీ నాన్నని మోసం చేసి 20 లక్షలు తీసుకున్నప్పుడు నీకు అనిపించలేదా..? ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తామని అంటే నర్మదా తన నగలని బయటకు తీస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ నగలని ఎందుకు తీస్తున్నావు.. ఇది తప్ప ఇప్పుడు మనకు వేరే పరిస్థితి లేదు ఈ నగలను తాకట్టు పెట్టేసి మనం 20 లక్షలు తీసుకురావాలి. ఆ తర్వాత నేను జాబ్ మీద లోన్ పెట్టుకొని నగలను బయటకు తీసుకొస్తాను అని అంటుంది. థాంక్స్ నర్మదా నువ్వు నన్ను కాపాడావు నా ప్రాణాలని పోకుండా చేశావు అని సాగర్ అంటారు.. అయితే ఆ నగలను తీసుకొని దొంగ చాటుగా వెళ్లిపోవడం చూసిన ఆనందరావు నర్మదా ఏదో పైట కింద దాస్తుంది వెంటనే ఈ విషయాన్ని భాగ్యంతో చెప్పాలని అనుకుంటాడు.

Advertisement

 ఆ విషయం నీ భాగ్యంతో చెప్పగానే భాగ్యం ఇంకా ఎక్కడున్నావేంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏంటో కనుక్కోపు అనేసి పంపిస్తుంది. నర్మదా సాగర్ లో ఒక సేటు తాకట్టు కొట్టుకి వెళ్లి అక్కడ నగలను బయటపెట్టి డబ్బులు కావాలి అని అడుగుతారు. అయితే ఆ నగలను చూసినా సేటు కేవలం వీటికి తొమ్మిది లక్షలు మాత్రమే వస్తాయి అని అంటాడు ఆ మాట వినగానే నర్మదా సాగర్ షాక్ అవుతారు. ఏంటి 9 లక్షలు వస్తాయి మాకు 20 లక్షలు కావాలి అప్పుగా ఇచ్చిన పర్వాలేదు అని నర్మదా అంటుంది. నగలనీ ఇవ్వడం చూసిన ఆనందరావు వామ్మో 20 లక్షల కోసం ఇల్లు నగలని తాకట్టు పెట్టారా ఈ విషయాన్ని వెంటనే నేను భాగ్యంకి చెప్పాలి అని అంటాడు.

ఇద్దరూ కలిసి నగలనీ తీసుకున్న సేటును 20 లక్షలు డబ్బులు కావాలని అడుగుతారు. ఆ సేటు మీరు ప్రసాద్ గారి అమ్మాయి కదా మీరు రామరాజు గారి అబ్బాయి కదా మీ మీద నమ్మకంతో నేను మీకు 20 లక్షల అప్పుగా ఇస్తాను అని అంటాడు. అయితే మీ మీద నమ్మకంతో నేను మీకు రెండు రూపాయలు వడ్డీకి మాత్రమే ఇస్తున్నాను. ఏంటి వడ్డీక వద్దులే నర్మదా అని సాగర్ అంటాడు.. పర్వాలేదు ఇవ్వండి అని నర్మదా 20 లక్షలు తీసుకొని వనజ వాళ్ళ ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది. ప్రేమ ధీరజ్ చాలా ఆవేశంగా ఇంటికి వచ్చేస్తారు..

Advertisement

 శ్రీవల్లి మిల్లు మన చేతికి వచ్చినా కూడా ఈ పనిమనిషి తిప్పలు మాత్రం నాకు తగ్గడం లేదు. నేను ఎప్పటికీ పని మనిషి లాగే ఉండిపోతున్నా ఏంటి? ఈ ఇంటి పెత్తనం కూడా నా చేతికి వస్తే నలుగురు పనివాళ్ళు అని పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ బూజు దులుపుతూ ఉంటుంది.. ఆ తర్వాత ఇద్దరు కోపంగా రావడం చూసి షాక్ అవుతుంది. ఏంటి ఎప్పుడు లేంది వీళ్లిద్దరూ ఇంత ఆవేశంగా వెళ్తున్నారు ఏదో జరిగింది ఏదో తప్పు పని చేసి ఉంటాడు. గది దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని వెళుతుంది. ధీరజ్ తో ప్రేమ కోపం తగ్గించుకోరా అని హితబోధ చేస్తుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి ఏదో తప్పు చేసి ఉంటాడు. అందుకే ప్రేమ ఇలా సద్ది చెప్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బయటకు వచ్చిన ప్రేమ శ్రీవల్లిని చూసి మొగుడు పెళ్ళాలు గది బయట మాటలు వినడం నీకు సిగ్గుగా అనిపించలేదా అని శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

 20 లక్షలు డబ్బులు తీసుకుని వెళ్లిన నర్మదా వనజ గారి ఇంటి దగ్గరికి వెళ్లి ఆ డబ్బులు ఇవ్వాలని అనుకుంటుంది.. అయితే అక్కడున్న వనజ లోపలికి రమ్మని ఎంతగా పిలిచినా సరే.. మీరు మర్యాద గలవారు కదా మేము మీ ఇంట్లో లోపలికి వస్తే మీ మర్యాద తగ్గిపోతుంది అని నర్మదా దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. మా మామయ్య గారు ఎలాంటి వాళ్ళు మాకు తెలుసు మర్యాద తెలిసే మీరు మా ఇంటికి సంబంధం కలుపుకోడానికి వచ్చారు. కానీ మీరు అన్న మాటలతో మీ మీద ఉన్న మర్యాద పోయింది అని నర్మదానడంతో వనజ షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత వనజ గారికి డబ్బులు ఇచ్చి క్లాసు పీకుతుంది నర్మదా. మనోహర్ తో నర్మదా నిజాన్ని బయటపెట్టిస్తుంది. నర్మద మాత్రం తన మామయ్య గొప్పతనం అని చెప్తూ వనజకి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది.

Also Read :పల్లవి చెక్ పెట్టబోతున్న అభి.. అవనికి అవమానం.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..

అయితే భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా నర్మద పని పట్టాలని వెయిట్ చేస్తూ ఉంటారు. తన ఫ్రెండు మీనాక్షికి చెప్పిన విషయాన్ని ఏం చేశావు అని భాగ్యం కనుక్కుంటుంది. అయితే అతను ఒక జాబ్ ఇప్పించే బ్రోకర్ అని చెప్పగానే..వాళ్ళు నిజంగానే సాగరు జాబు కోసమే డబ్బులు కొట్టేశాడు అని కన్ఫామ్ చేసుకుంటారు. నీకు ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆనందరావు నిజంగానే నగలని తాకట్టు పెట్టి 20 లక్షలు వనజ వాళ్లకి ఇచ్చొచ్చారు అని అనగానే షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×