E-Paper
Advertisement

Camera Phones Ranking: 2025లో బెస్ట్ కెమెరా ఫోన్స్ ర్యాంకింగ్.. అగ్రస్థానం కోల్పోయిన ఐఫోన్‌.. టాప్ ఎవరంటే

Camera Phones Ranking: 2025లో బెస్ట్ కెమెరా ఫోన్స్ ర్యాంకింగ్.. అగ్రస్థానం కోల్పోయిన ఐఫోన్‌.. టాప్ ఎవరంటే

Best Camera Phones Ranking|స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీలో గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా మార్పు చెందుతోంది. కొత్త కొత్త టెక్ అప్‌గ్రేడ్లతో మోడర్న్ ఫోన్‌లు ప్రొఫెషనల్ కెమెరాలకు సవాలుగా నిలుస్తున్నాయి. పెద్ద సెన్సార్లు, ఏఐ ప్రాసెసింగ్ ఊహించని స్థాయికి ఫోటో క్వాలిటీని మెరుగుపరుస్తాయి. అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఇమేజెస్, వీడియోలను ఎన్‌హాన్స్ చేస్తుంది. చాలా మంది యూజర్లు ఫోటోగ్రఫీకి కెమెరాలకు బదులు స్మార్ట్‌ఫోన్‌లపైనే ఆధారపడుతున్నారు. అందుకే ఈ సంవత్సరం 2025లో విడుదలైన స్మార్ట్‌ఫోన్ల కెమెరాలపరంగా పోల్చి ఏది బెస్ట్ అని ఒక ర్యాంకింగ్స్ జాబితా ఇటీవలే విడుదలైంది. ఈ జాబితాలో షాకింగ్ విషయమేమిటంటే ఇందులో తాజా ఐఫోన్ సిరీస్ అగ్రస్థానంలో లేకపోవడం

DXOMARK 2025లో బెస్ట్ కెమెరా ఫోన్‌ ర్యాంకింగ్

DXOMARK అనేది ట్రస్టెడ్ కెమెరా టెస్టింగ్ ప్లాట్‌ఫామ్. సైంటిఫిక్‌గా కెమెరా పర్ఫామెన్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ 2025 ర్యాంకింగ్స్ చాలా మంది స్మార్ట్‌ఫోన్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్య పరిచాయి. ఐఫోన్ టాప్ పొజిషన్ సాధించలేదు. ఇతర బ్రాండ్లు ఆపిల్ కంటే మెరుగైన కెమెరా క్వాలిటీతో విడదులయ్యాయి.

అగ్రస్థానంలో Huwaei ప్యూరా 80 అల్ట్రా

హవాయ్ ప్యూరా 80 అల్ట్రా DXOMARK 2025 ర్యాంకింగ్ లిస్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. లార్జ్ వన్-ఇంచ్ సెన్సార్ ఉపయోగించింది. వేరియబుల్ అపర్చర్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. వివిధ లైటింగ్ కండిషన్స్‌కు అడాప్ట్ అవుతుంది. 40 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. రెండు పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు 3.7x, 9.4x ఆప్టికల్ జూమ్ ఇస్తాయి. డేలైట్, లో లైట్‌లో అద్భుతమైన ఫోటోలు తీస్తుంది. ఫ్లెక్సిబుల్ కెమెరా కంట్రోల్స్ క్రియేటివ్ ఫోటోగ్రఫీ మెరుగుపరుస్తాయి. హవాయ్ ప్యూరా 80 అల్ట్రా ఇండియాలో ప్రస్తుతం అందుబాటులో లేదు.

ర్యాంక్ 2- ఓప్పో ఫైండ్ X8 అల్ట్రా

ఓప్పో ఫైండ్ X8 అల్ట్రా లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. అడ్వాన్స్‌డ్ క్వాడ్-కెమెరా సిస్టమ్ ఉంది. అయిదు వేర్వేరు కెమెరా సెన్సార్లు ఉన్నాయి. ప్రైమరీ కెమెరా వన్-ఇంచ్ 50 మెగాపిక్సెల్ సెన్సార్. 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. 3x, 6x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. డెడికేటెడ్ క్రోమా సెన్సార్ కలర్ ఆక్యురసీ మెరుగుపరుస్తుంది. జూమ్ ఫోటోగ్రఫీలో అద్భుతం చూపిస్తుంది.

మూడో స్థానంలో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 2025 కెమెరా ర్యాంకింగ్స్‌లో ఆశ్చర్యకరంగా మూడో స్థానంలో ఉంది. ఈ హై ఎండ్ ఐఫోన్ మోడల్ లో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. DXOMARK వీడియో రికార్డింగ్ పర్ఫామెన్స్‌ను ప్రశంసించింది. కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీలో బలంగా ఉంది. ఆపిల్ వీడియో స్టెబిలైజేషన్ ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకుంటుంది. ఫోటోలు, వీడియోలకు బాగుంటుంది. ఏఐ ప్రాసెసింగ్ ఇమేజ్ క్వాలిటీ మెరుగుపరుస్తుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ బ్యాలెన్స్ బాగుంది. ఇండియాలో ప్రారంభ ధర రూ.1,34,900 దాకా ఉంది.

వివో X200 అల్ట్రాకు నాలుగో ర్యాంక్

వివో X200 అల్ట్రాకు నాలుగో ర్యాంక్ దక్కింది. జీస్ ఆప్టిక్స్ సూపీరియర్ ఇమేజ్ క్వాలిటీ ఇస్తాయి. 35మ్మీ ప్రైమరీ కెమెరా లెన్స్ ఉంది. అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ జూమ్ మెరుగుపరుస్తుంది. స్పెషల్ సోనీ సెన్సార్ ఉపయోగించింది. గింబల్ స్టెబిలైజేషన్ లో లైట్ ఫోటోగ్రఫీ మెరుగుపరుస్తుంది. నైట్ ఫోటోలు క్లియర్, షార్ప్‌గా వస్తాయి. వీడియో స్టెబిలైజేషన్ స్మూత్‌గా ఉంటుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ యూజర్లకు టార్గెట్ చేసింది.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

అయిదో స్థానంలో గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఐదో స్థానంలో ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌పై హెవీగా ఫోకస్ చేసింది. పిక్సెల్ ఫోన్‌లు నేచురల్ కలర్స్‌కు ప్రసిద్ధి. ఏఐ సాఫ్ట్‌వేర్ ఫోటోలను ఆటోమాటిక్‌గా మెరుగుపరుస్తుంది. ఎవరీడే ఫోటోగ్రఫీలో బాగుంటుంది. పోర్ట్రెయిట్ షాట్స్ రియలిస్టిక్, బ్యాలెన్స్‌డ్‌గా వస్తాయి. లో లైట్ ఫోటోగ్రఫీ బలంగా ఉంది. కన్సిస్టెంట్ కెమెరా పర్ఫామెన్స్ మెయింటైన్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ డ్రైవెన్ ఇమేజింగ్‌పై ప్రాధాన్యం ఇచ్చింది.

యూజర్లపై ర్యాంకింగ్ ప్రభావం

2025 ర్యాంకింగ్ ఇంటెన్స్ కాంపిటీషన్ చూపిస్తోంది. ఒకే బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో డామినేట్ చేయడం లేదు. ఆండ్రాయిడ్ బ్రాండ్లు కెమెరా ఇన్నోవేషన్‌లో లీడ్ చేస్తున్నాయి. ఆపిల్ వీడియో పర్ఫామెన్స్‌లో బలంగా ఉంది. యూజర్లకు అనేక అద్భుతమైన కెమెరా ఫోన్  ఆప్షన్లు ఉన్నాయి.

 

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×