E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికి కొత్త టెన్షన్.. పెళ్లి ఆపేందుకు మహా ప్రయత్నాలు.. మహాకు మాటిచ్చిన చక్రి.. నెక్స్ట్ ఏంటి..?

Podarillu Today Episode : చక్రికి కొత్త టెన్షన్.. పెళ్లి ఆపేందుకు మహా ప్రయత్నాలు.. మహాకు మాటిచ్చిన చక్రి.. నెక్స్ట్ ఏంటి..?
Advertisement

Podarillu Today Episode December 23rd : మహా భూషణ్ తో మాట్లాడాలని అనుకుంటుందని ఆదితో హారిక అంటుంది.. మహా భూషణ్ ని బయటికి పంపిస్తే వీళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని హారిక అంటుంది. భూషణ్ దగ్గరికి వెళ్లి చక్రి హారిక ఇద్దరు కూడా ఈ విషయం గురించి మాట్లాడతారు. అతనికి భూషణ్ ప్రశ్నలతో విసిగించి మరి ఒప్పుకుంటాడు.. మహా భూషణ్ ఇద్దరు కలిసి బయటికి వెళ్లేందుకు చక్రిని కారు తీయమని అంటారు. ఇక ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకోవాలని అనుకుంటారు. మహా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ భూషణ్ మాత్రం తాను చెప్పిందే వినాలని కండిషన్స్ పెడుతూ వస్తాడు.. నాకు జాబ్ చేయాలనిపిస్తుంది నేను కొద్ది రోజులు జాబ్ చేస్తాను అని మహా భూషణ్ ని అడుగుతుంది.. మాట వినగానే భూషణ్ నువ్వు జాబ్ కి వెళ్తే నేను చెక్కభజన చేయాలని సీరియస్ అవుతాడు. మహా మాత్రం ఇలాంటి వాడు నాకు వద్దు అని మనసులో అనుకుంటుంది. కానీ మహా కోసం ప్రతాప్ అక్కడికి వస్తాడు. భూషణ్ రిజిస్టర్ మ్యారేజ్ గురించి చెప్తాడు. ఇక చేసేదేమి లేక ఒప్పేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భూషణ్ ప్రవర్తన తెలుసుకున్న మహా అతని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని ఫిక్స్ అయిపోతుంది.. మహా ఇలా చేస్తుంది అని ఆది ప్రతాప్ కి ఫోన్ చేసి చెప్తాడు.. మహాకే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రతాప్. మహాతో మాట్లాడుతున్న సమయంలో ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి వారిని చంపేయండి అని సీరియస్ అవుతాడు. ఇక మహా కూడా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతుంది. భూషణ్ మహాను కూడా పిలవండి అని అంటారు. పెళ్లయి వీసా వచ్చేలోగా చాలా టైం పడుతుంది. అందుకే నేను వీసా కోసం ట్రై చేయాలి కదా అంకుల్.. ముందుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఈ పనులన్నీ పూర్తి అవుతాయి అని అంటాడు. మీరు ఏమంటారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మేలు కదా అని భూషణ్ అంటాడు. ఆ మాట వినగానే మహా నాకు ఈ పెళ్లి ఇప్పుడే ఇష్టం లేదు ఇంత సడన్గా చెప్తే ఎలా అంటుంది..

Advertisement

ఫోటోలు కావాలని భూషణ్ అడగ్గానే మహా అతనిపై సీరియస్ అవుతుంది.. మధ్యలో హారిక కలగజేసుకొని ఆ గొడవని సద్దుమణిగేలా చేసి మహాని ఫోటోలు తీసుకొని రమ్మని చక్రీతో పంపిస్తుంది.. చక్రి ఒంటరిగా దొరికిన మహాతో మాటలు కలపాలని అనుకుంటాడు.. మొత్తానికి వీరిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది.. ఇక తర్వాత రోజు ఉదయం ఆది చక్రిని ఇక వెళ్ళిపొమ్మని చెప్తాడు. అదేంటి సార్ ఇంత సడన్గా చెప్పారు నా పరిస్థితి ఏంటి అని చక్రి అడుగుతాడు. నిన్ను టెంపరరీ గా మాత్రమే కదా తీసుకుందాం.. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడో ఉండదో తెలియక నేను వేరే ట్రిప్ కూడా ఒప్పుకోలేదు సార్ అని చక్రి అంటాడు.

అప్పుడు ఎక్కడికొచ్చిన ప్రతాప్ నువ్వు మాతో పాటు యాదగిరిగుట్ట కూడా రావాలి అని అంటాడు. మాకు మా అమ్మాయి పెళ్లి అయ్యేంతవరకు టెంపరరీగా డ్రైవర్ కావాలి అని అంటాడు. సరే సార్ నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు దీన్ని ఎలాగైనా వినియోగించుకోవాలి అని అనుకుంటాడు. మూడు గంటల ప్రయాణం మహాతో మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు అని సంబరపడిపోతూ ఉంటాడు. కార్ల వెళ్లేటప్పుడు మహాని చూస్తూ చక్రి డ్రైవింగ్ చేయడం మర్చిపోతాడు. ఇక తర్వాత మహా కి ఇష్టమైన స్వీట్ ని కొని వాళ్ళని ప్రతాప్ అనుకుంటాడు.. నాకు ఇష్టమైన స్వీట్ను కొంటాను అంటున్నారు. కానీ నా బాధని నా జీవితం గురించి ఆలోచనలని మీరు మార్చుకోవడం లేదు అని ఫీల్ అవుతుంది మహా..

Advertisement

ఇక ఇంటికి వెళ్ళగానే అక్కడ లలిత కూడా మహా పెళ్లి గురించి మాట్లాడుతుంది.. అబ్బాయికి ఏం తక్కువ అన్ని బాగానే ఉన్నాయి ఈ పెళ్లి మాత్రం ఖచ్చితంగా అబ్బాయి తోనే జరుగుతుంది అని లలిత అంటుంది. మహా మాత్రం ఇంత అర్జెంటుగా పెళ్లి చేసి నన్ను పంపించాలని అనుకుంటున్నారా? కొంచెమైన ఆలోచించరా అని మహా అంటుంది. అతని వాళ్ళ ఇంట్లో వాళ్ళే భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నారు.. మీరు మాత్రం ఈ విషయాన్ని ఎందుకు గమనించలేదు అని మహా అడుగుతుంది.. వాళ్లు మాట్లాడుకోవడం విన్న చక్రి మహా కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు.. మహా మాత్రం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నేను వెళ్ళిపోతున్నాను అని భోజనం చేయకుండా వెళ్ళిపోతుంది..

హారిక మహా భోజనం చేసి వెళ్ళు అని ఎంత పిలుస్తున్న సరే తను మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది.. అయితే ఆది నువ్వు అనవసరంగా దానికి సపోర్ట్ చేయకు భోజనం చేయకపోయినా ఏం కాదు ఈ పెళ్లి జరిగే తీరుతుంది అని అంటాడు. మహా ఆవేశంగా బయటికి వెళ్లి కూర్చుంటుంది. వీళ్లు భోజనం పెడతారా లేదా బయటికి వెళ్లి తిని రమ్మంటారా ఏది చెప్పడం లేదే అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహా ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది మరి నాకు భోజనం పెడతారా? లేదా తినేసి రమ్మంటారా? ఎందుకంటే నేను ఆకలికి ఆకలేను అని అడుగుతాడు.. ఇంకా భోజనం చేయలేదా అని మహా అడుగుతుంది.. చేయలేదు కాబట్టే బయటకు వెళ్లి తినేసి రమ్మంటారా అని అడిగాను అని చక్రి అంటాడు. చక్రి కోసం మహా భోజనం తెచ్చి ఇస్తుంది. చక్రి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులను జరగదు మీరేం బాధపడకండి అని ధైర్యం చెప్తాడు.

Also Read :అయ్యో.. శ్రీవల్లికి పరిస్థితి దారుణం.. ప్రేమకు నిజం చెప్పేసిన విశ్వం.. ప్రేమ, ధీరజ్ మధ్య చిచ్చు..?

నా పెళ్లి ఆపడానికి నువ్వెవరు మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అని మహా అంటుంది.. మీరు అవన్నీ వదిలేసేయండి నేను చూసుకుంటాను కదా అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహాను గుడికి తీసుకెళ్లాలని హారిక అక్కడికి వస్తుంది. ఇక్కడ నా మనసుని ఎవరు అర్థం చేసుకోవట్లేదు కనీసం గుడికి అయిన వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో చక్రి మహా పెళ్లిని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×