E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్‌బడ్స్ విడుదల!

సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాటరీ.. హువావే నుంచి బెస్ట్ ప్రీమియం ఇయర్‌బడ్స్ విడుదల!
Advertisement

Huawei FreeClip 2 S: ప్రముఖ టెక్ దిగ్గజం హువావే తమ సరికొత్త ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ ‘హువావే ఫ్రీక్లిప్ 2 ఎస్’ ను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. మలేషియాలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో పీ90ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు, మేట్‌ప్యాడ్ ఎయిర్ 2026 టాబ్లెట్‌తో పాటు వీటిని కంపెనీ పరిచయం చేసింది. సరికొత్త డిజైన్, అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం.

సరికొత్త డిజైన్.. సూపర్ కంఫర్ట్:

ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ వినూత్నమైన ఓపెన్-ఇయర్ సీ-బ్రిడ్జ్ డిజైన్‌తో వచ్చాయి. చెవులకు చాలా సాఫ్ట్‌గా ఉండేలా 25 శాతం మెరుగైన లిక్విడ్ సిలికాన్ మెటీరియల్‌ను ఇందులో వాడారు. దాదాపు పది వేల మంది చెవుల ఆకృతిని పరిశీలించి ఈ డిజైన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల ఇవి పెట్టుకున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, ఎడమ-కుడి చెవులను ఇవి ఆటోమేటిక్‌గా గుర్తించగలవు.

Advertisement

Also Read: వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలోనే 8000mAh బ్యాటరీ మొబైల్, ధర ఎంతంటే?

అదిరిపోయే సౌండ్ క్వాలిటీ:

చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇందులో డ్యూయల్ 10.8mm డ్రైవర్లను అమర్చారు. దీంతో బేస్ పెర్ఫార్మెన్స్, సౌండ్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. ఇందులో డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో కూడిన స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంది. తద్వారా మనం తల తిప్పినా సౌండ్ సిస్టమ్ దానికి తగ్గట్టుగా మారి థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది. పక్కన ఉన్నవారికి సౌండ్ వినబడకుండా ఉండేందుకు రివర్స్ సౌండ్ వేవ్ టెక్నాలజీని కూడా ఇందులో ఇచ్చారు.

38 గంటల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

బ్యాటరీ విషయానికి వస్తే ఇది యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేవలం ఇయర్‌బడ్స్ మాత్రమే సింగిల్ ఛార్జ్‌పై 9 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే ఏకంగా 38 గంటల పాటు వాడుకోవచ్చు. కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే 3 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. టైప్-సి ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ధర, ఇతర ఫీచర్లు:

ఇందులో బ్లూటూత్ 6.0, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ట్రిపుల్ మైక్ సిస్టమ్, ఐపీ57 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే.. మలేషియాలో దీని ధర రూ.21,200గా ఉంది. ఐరోపాలో రూ.25,200, బ్రిటన్‌లో రూ.25,600గా నిర్ణయించారు. ఇవి డీప్‌సీ బ్లూ, స్పేస్ సిల్వర్ రంగుల్లో హువావే అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

Also Read: చూపు తిప్పుకోనివ్వని కలర్స్‌తో నుబియా AI ఫోన్.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×