E-Paper
Advertisement

ఎల్లంపేట్‌లో అక్రమ నిర్మాణాలు.. ఇళ్ల అనుమతులతో కమర్షియల్ షట్టర్లు!

ఎల్లంపేట్‌లో అక్రమ నిర్మాణాలు.. ఇళ్ల అనుమతులతో కమర్షియల్ షట్టర్లు!
Advertisement

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్‌లో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్టకు చేరాయి. ఇళ్ల స్థలాల్లో వ్యాపార సామ్రాజ్యాలు వెలుస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెసిడెన్షియల్ భవనాలంటూ అనుమతులు పొంది, కమర్షియల్ షట్టర్ల నిర్మాణాలు జోరుగా సాగిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అనుమతులు ఒకదానికి.. నిర్మాణాలు మరొకదానికి

Advertisement

డబిల్‌పూర్‌లో నివాస గృహాల కోసం మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటున్న కొందరు యజమానులు.. క్షేత్రస్థాయికి వచ్చేసరికి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్లాన్ లో ఉన్నదానికి, అక్కడ జరుగుతున్న నిర్మాణానికి అస్సలు పొంతన ఉండటం లేదు. నివాస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కమర్షియల్ షట్టర్లను నిర్మిస్తూ వ్యాపార సముదాయాలుగా మారుస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం కళ్ల ముందే ఈ అక్రమ తంతు సాగుతున్నా.. వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.

ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం

Advertisement

‘నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని మేము పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఈ మౌనం వెనుక ఉన్న రహస్యమేంటో అర్థం కావడం లేదని, ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా పట్టు సాధించాల్సి ఉంది.. టీపీఓ

ఈ వివాదంపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) మహేష్‌ స్పందించారు. ‘నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించి కేవలం నెల రోజులే అయింది. మున్సిపాలిటీ పరిధిలోని పూర్తి స్థాయి పరిస్థితులపై ఇంకా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది. డబిల్‌పూర్‌లో జరుగుతున్న నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను ఖచ్చితంగా పరిశీలిస్తాం. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.

Also Read: డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×