Huawei Mate X7 Foldable Phone| హవాయ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని పేరు హవాయ్ మేట్ ఎక్స్7 (Huawei Mate X7). ఈ కొత్త ఫోల్డెబుల్ ఫోన్ గత ఏడాది వచ్చిన Mate X6 కు అప్‌గ్రేడ్ లాంటిది. ఈ ఫోన్‌ని ఒక పుస్తకం లాగా మడత పెట్టే సౌకర్యం ఉంది. హవాయ్ సొంత ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. చాలా పవర్‌ఫుల్ ఫోన్! కానీ దీని ధర చాలా ఎక్కువ.
హవాయ్ మేట్ X7 బేసిక్ మోడల్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర CNY 12,999.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1,63,700.
12GB + 512GB వేరియంట్ ధర CNY 13,999 (రూ. 1,76,168)
కలర్ ఆప్షన్స్: తెలుపు, నీలం, పర్పుల్, ఎరుపు, నలుపు – మొత్తం 5 రంగులు ఉన్నాయి.
కలెక్టర్స్ ఎడిషన్ – ఇంకా ఖరీదైనవి!
ఈ ఫోన్‌కి ప్రత్యేకమైన కలెక్టర్స్ ఎడిషన్ కూడా ఉంది. ఇందులో ఎక్కువ ర్యామ్, ఎక్కువ స్టోరేజ్ ఉంటాయి.
16GB + 512GB ధర CNY 14,999 (రూ. 1,88,752)
16GB + 1TB ధర CNY 15,999 (రూ. 2,01,337)
20GB RAM + 1TB ధర CNY 17,599 (రూ. 2,21,472 )ఇది అత్యంత ఖరీదైన వేరియంట్
లోపలి ఫోల్డబుల్ స్క్రీన్ 8 అంగుళాల LTPO OLED. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. బయటి కవర్ స్క్రీన్ 6.49 అంగుళాలు, ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని బ్రైట్‌నెస్ ఇంకా ఎక్కువ – 3000 నిట్స్! ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది.
హవాయ్ సొంత Kirin 9030 Pro చిప్‌సెట్ తో ఈ ఫోన్ రన్ చేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ ఏ పని అయినా స్మూత్‌గా జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ – HarmonyOS 6 (తాజా వెర్షన్).
వెనకాల 3 కెమెరాలు ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా (OISతో), 40MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (3.5x ఆప్టికల్ జూమ్). ముందు సెల్ఫీ కెమెరా 8MP ఉంది.
సాధారణ మోడల్‌లో 5600 mAh బ్యాటరీ ఉంది.
66W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. కలెక్టర్స్ ఎడిషన్‌లో బ్యాటరీ కొంచెం తక్కువ – 5525 mAh మాత్రమే ఉంది.
Wi-Fi, బ్లూటూత్, GPS, NavIC, USB టైప్-C పోర్ట్ – అన్నీ ఉన్నాయి.
హవాయ్ ఈ Mate X7తో మళ్లీ ఫోల్డబుల్ మార్కెట్‌లో గట్టిగా పోటీ ఇస్తోంది. ధర ఖరీదైనా, ఫీచర్స్ చూస్తే చాలా ఖరీదైన ప్రీమియం ఫోన్ అనిపిస్తుంది. ఇండియాలో కూడా త్వరలోనే లాంచ్ కానుంది. కానీ ఫోల్డబుల్ ప్రేమికులు మాత్రం కొంతకాలం ఎదురు చూడాల్సిందే.
Also Read: గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది