E-Paper
Advertisement

POCO C85 5G: పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. 6.9 అంగుళాల డిస్‌ప్లేతో C85 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది!

POCO C85 5G: పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. 6.9 అంగుళాల డిస్‌ప్లేతో C85 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది!
Advertisement

POCO C85 5G: కొంత కాలంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తక్కువ బడ్జెట్ 5G ఫోన్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. చైనా బ్రాండ్ POCO తన C సిరీస్‌లో భాగంగా కొత్తగా ‘POCO C85 5G’ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే పలు కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను తీసుకువస్తున్నా.. పోకో మాత్రం ధర విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. చాలా తక్కువ బడ్జెట్‌లోనే 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అతి తక్కువ ధరలో కొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఇదొక మంచి అవకాశం.

భారీ డిస్‌ప్లే:

పోకో నుంచి తాజాగా వచ్చిన POCO C85 5G ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో బెటర్‌గా నిలుస్తోంది. ఇది 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తుండటంతో వీడియోలు చూడటం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం లాంటి పనులకు బిగ్ స్క్రీన్ అనుభూతిని అందిస్తుంది. ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

Advertisement

Also Read: 55 అంగుళాల TCL QLEDపై మెగా ఆఫర్.. రూ.1.09 లక్షల టీవీ రూ.36,990కే వచ్చేస్తోంది!

లేటెస్ట్ ఫీచర్లు:

ఇకపోతే బ్యాటరీ విషయంలోనూ POCO ఎక్కడా నిరాశపరచలేదు. దీనిలో 6000mAh కెపాసిటీ బ్యాటరీ ఉండటంతో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజూ మొత్తం వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం అదనంగా ప్లస్ అవుతుంది. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఈ ఫోన్ Android 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీంతో లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

బడ్జెట్ ధరలోనే:

Advertisement

POCO C85 5Gను కంపెనీ మొత్తం మూడు వేరియంట్లలో విడుదల చేసింది. 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.12,500గా ఉండగా.. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13,500 ధరకు లభిస్తుంది. ఇక 8GB RAM + 128GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర దాదాపు రూ.15,000 ఉంది. అంతేకాదు.. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుందని POCO తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా:

ఈ POCO C85 5G స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 15 నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి వచ్చింది. దీని గురించి సంస్థ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇదొక మంచి ఎంపికగా నిలిచే అవకాశముంది.

Also Read: భారీ బ్యాటరీ, 8GB RAMతో పవర్‌ఫుల్ టాబ్లెట్.. వన్‌ప్లస్ Pad Go 2 లాంచ్‌కు రంగం సిద్ధం!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×