AP DSC Scam: డీఎస్సీ 2025 కుంభకోణం రోజురోజుకూ కొత్త కోణాలు బయటపడుతున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. సాక్షి టీవీ, బిగ్ టీవీ, జగనన్న కనెక్ట్స్ వంటి ఖాతాలపై నిషేధం విధించారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై సైబర్ దాడులు, కేసులు పెడుతున్నారని విమర్శలు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు నెరవేరలేదని ప్రజల్లో ఆగ్రహంతో ఉన్నారని, అవినీతి, అధికార దుర్వినియోగంపై ప్రశ్నలు వేస్తే సెన్సార్‌షిప్ విధిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోస్ట్‌లు తొలగిస్తే నిజాలు దాగవు, ఖాతాలు బ్లాక్ చేస్తే సత్యం మాయం కాదని జగన్ తెలిపారు.
ప్రశ్నలకు భయపడితే ప్రజాస్వామ్యం నిలబడదు, జవాబులిస్తేనే నమ్మకం పెరుగుతుందని, డీఎస్సీ అక్రమాలపై నిజాలు బయటపెట్టడానికి స్వతంత్ర విచారణ అనివార్యం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఈటీ పాస్ కాని అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని విమర్శలు చేశారు. జీవోలు జారీ చేసి, తర్వాత రద్దు చేసి, నియామకాలు మాత్రం కొనసాగించారని జగన్ ఆరోపనలు చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అర్హులకు తిరస్కరణ, అనర్హులకు అనుకూలత జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Also read: ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
యూవగళం పోస్టింగ్స్ పేరుతో లోకేశ్ టీమ్‌కు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, సీబీఐ విచారణకు నిరాకరిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రశ్నలు అడిగేవారిని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించే పోస్ట్‌లు, ఖాతాలు రిస్ట్రిక్ట్ అవుతున్నాయని ఫైర్ అయ్యారు. మెటా సంస్థ “లీగల్ రిక్వైర్‌మెంట్స్” పేరుతో కంటెంట్‌ను తొలగిస్తోందని అన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జగన్ తెలిపారు. విద్యా వ్యవస్థను రాజకీయ లాభాలకు వాడటం సహించబోమని ప్రజలు హెచ్చరిస్తున్నారని జగన్ తెలిపారు.
Also read: గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?