E-Paper
Advertisement

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి?  దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం
Advertisement

Lord’s Bell :  లార్డ్స్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చిట్టచివరి వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్.. 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ లో యువరాజు సింగ్ ప్రత్యేక అతిథిగా హాజరై.. ప్రతిష్టాత్మక లార్డ్స్ గంట కొట్టాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలకు మ్యాచ్ షురూ అయింది.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

లార్డ్స్ లో మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు గంట ఎందుకు కొడతారు ?

Advertisement

లార్డ్స్ మైదానంలో టెస్ట్, వన్డే లేదా టి20 ఇలా ఏ మ్యాచ్ జరిగిన కచ్చితంగా గంట కొడతారు. ఈ గంట మోగిన ఐదు నిమిషాలకు ఆట ప్రారంభమవుతుంది. అయితే మైదానంలో ఈ గంట కొట్టడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. స్టేడియంలో ఉన్న అభిమానులను అటు ప్లేయర్లను అలర్ట్ చేయడానికి గంట కొడతారు. గంట కొట్టగానే స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ తమ తమ సీట్లలో కూర్చోవాలి. అదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్, డకౌట్ లలో ఉన్న ప్లేయర్లు, అంపైర్లు అందరూ కూడా స్టేడియంలోకి రావాల్సి ఉంటుంది. గంట కొట్టిన ఐదు నిమిషాలకు మ్యాచ్ షురూ కావాలి. అయితే ఈ గంటను మోగించే అవకాశం దక్కించుకోవడాన్ని క్రికెట్ ప్రపంచంలో గొప్ప వరంగా కూడా భావిస్తారు. లార్డ్స్ స్టేడియాన్ని క్రికెట్ కాశీగా పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఈ గంటను ఏర్పాటు చేశారు. ఈడెన్ గార్డెన్స్ లో కూడా ఇలాంటి గంట ఉంది. 1864 నుంచే ఈ గంట లార్డ్స్ స్టేడియంలో ఉంది. కానీ 2007 నుంచి ప్రముఖులు ఈ గంటను మోగించేలా రూల్ పెట్టారు.

ఈ గంటను ఎవరు మోగిస్తారు ?

లార్డ్స్ మైదానంలో ఉన్న గంటను మోగించేందుకు కొన్ని అర్హతలు ఉంటాయి. అంతర్జాతీయ మాజీ అలాగే దిగ్గజ క్రికెటర్లు ఈ గంటను మోగిస్తారు. అలాగే క్రికెట్ బోర్డుల నిర్వాహకులు.. అంటే జై షా లాంటి వాళ్లు.. మోగించే అవకాశం ఉంటుంది. క్రీడారంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖులు కూడా లార్డ్స్ లో గంట మోగించవచ్చు. లార్డ్స్ మైదానం నుంచి ఆహ్వానం వెళితేనే గంట మోగించాలి.

ఇప్పటి వరకు ఇండియా తరఫున గంట మోగించిన క్రికెటర్లు

Advertisement

లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు చాలా మంది ఇండియన్ క్రికెటర్లు గంటను మోగించారు. 2007లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తొలిసారిగా గంట మోగించాడు. ఆ తర్వాత సునీల్గా భాస్కర్, వెంగ్ సర్కార్, రాహుల్ ద్రావిడ్, గంగూలీ, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్, తాజాగా యువరాజ్ సింగ్ గంట మోగించారు. ఇక లార్డ్స్ లో సెంచ‌రీలు, వికెట్లు ఎక్కువ తీసినా, హాన‌ర్ బోర్డులో పేర్లు లిఖిస్తారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Related News

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×