E-Paper
Advertisement

రూ.9 వేలకే మిలిటరీ గ్రేడ్ డిజైన్.. ఐటెల్ నుంచి కింద పడినా చెక్కుచెదరని కొత్త మొబైల్ లాంచ్!

రూ.9 వేలకే మిలిటరీ గ్రేడ్ డిజైన్.. ఐటెల్ నుంచి కింద పడినా చెక్కుచెదరని కొత్త మొబైల్ లాంచ్!
Advertisement

itel A100 Pro: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారి కోసం ఐటెల్ సంస్థ భారతదేశంలో సరికొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఐటెల్ ఏ100 సిరీస్‌లో భాగంగా itel A100 Pro మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం రూ.8,999 ధరలోనే లభించే ఈ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో బలమైన బాడీ, అదిరిపోయే సాఫ్ట్‌వేర్ ఫీచర్లను అందిస్తోంది. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

కింద పడినా చెక్కుదెదరని బాడీ:

సాధారణంగా బడ్జెట్ ఫోన్లు కింద పడితే త్వరగా పాడైపోతాయనే భయం ఉంటుంది. కానీ ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) సర్టిఫికేషన్ ఉంది. దీంతో ఇది చాలా బలంగా ఉంటుంది. అంత సులువుగా పగలదు. దీనికి తోడు కంపెనీ కొన్న మొదటి 100 రోజుల్లో ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది. ఇది బ్లాక్, క్లౌడ్ వైట్, కామెట్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో కాక రేపుతున్న Motorola Edge 70 Pro Plus.. డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

ఫోన్ అస్సలు స్లో అవ్వదు:

దీనిలో 6.6 ఇంచుల పెద్ద హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది కాబట్టి స్క్రీన్ చాలా స్మూత్‌గా సాగుతుంది. అలాగే ఫోన్ పైభాగంలో డైనమిక్ బార్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. దీనివల్ల ఫోన్ లాక్ తీయకుండానే ఛార్జింగ్, కాల్స్, నోటిఫికేషన్ల వివరాలు చూసుకోవచ్చు. అంతేకాదు.. ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌తో రావడం వల్ల ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వకుండా నడుస్తుంది.

నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్:

Advertisement

ఈ ఫోన్‌లో Unisoc T7100 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను వాడారు. దీనిలో 3GB RAM ఉంటుంది. అవసరమైతే వర్చువల్ RAM ద్వారా మరో 5GB వరకు పెంచుకోవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజ్ 64GB. అయితే ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఆల్ట్రాలింక్ అనే టెక్నాలజీ ఉంది. దీనివల్ల సిగ్నల్స్ సరిగ్గా లేనిచోట లేదా నెట్‌వర్క్ అస్సలు లేని ప్రాంతాల్లో కూడా అత్యవసర కమ్యూనికేషన్ చేసుకోవడానికి వీలవుతుంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్:

ఫొటోల కోసం వెనుక వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందు వైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 5000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీతో పాటు 10 వాట్ ఛార్జర్ లభిస్తుంది. దీనిలోని ఐఆర్ బ్లాస్టర్ సహాయంతో ఇంట్లోని టీవీ, ఏసీలను రిమోట్ లాగా కంట్రోల్ చేయవచ్చు. భద్రత కోసం సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ సాధించిన Samsung Galaxy S26 సిరీస్.. ఆ ఫీచరే కారణమా?

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×