E-Paper
Advertisement

రూ.8 వేల లోపే ఇలాంటి ఫోనా? Infinix Smart 20 ఎంట్రీతో మార్కెట్ షేకవ్వాల్సిందే!

రూ.8 వేల లోపే ఇలాంటి ఫోనా? Infinix Smart 20 ఎంట్రీతో మార్కెట్ షేకవ్వాల్సిందే!
Advertisement

Infinix Smart 20: బడ్జెట్ ధరలో మొబైల్స్ కొనేవారికి ఇన్ఫినిక్స్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ Infinix Smart 20ను జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అమ్మకానికి రానుంది. గత ఏడాది వచ్చిన Smart 10 మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా వస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు ప్రస్తుతం మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ఆకట్టుకునేలా డిస్‌ప్లే:

ఈ Infinix Smart 20 ఫోన్ 6.78 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో వస్తోంది. దీనికి 120Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం విశేషం. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే గేమ్స్ ఆడేవారికి, వీడియోలు చూసేవారికి ఈ పెద్ద డిస్‌ప్లే సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

మెరుగైన ప్రాసెసర్:

Advertisement

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20లో మీడియాటెక్ హెలియో G81 అల్టిమేట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 4GB ర్యామ్ తోడవ్వడంతో.. పాత మోడల్‌తో పోలిస్తే దీనిలో మల్టీటాస్కింగ్, చిన్న చిన్న గేమ్స్ ఆడటం చాలా సులువు అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 5,200mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 15W ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Also Read: భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో Redmi Turbo 5.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

ఇంటర్నెట్ లేకున్నా కాల్స్:

Advertisement

ఈ ఫోన్ కేవలం 7.7mm మందంతో చాలా స్లిమ్‌గా, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. వెనుక వైపు టెక్స్‌చర్డ్ ఫినిషింగ్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. క్లౌడ్‌లైన్ బ్లూ, పోలారిస్ టైటానియం, షాడో బ్లాక్, సన్‌లైక్ ఆరెంజ్ అనే నాలుగు రంగుల్లో ఇది దొరుకుతుంది. ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ కోసం దీనికి IP64 రేటింగ్ ఇచ్చారు. అలాగే ఇంటర్నెట్ లేకపోయినా కిలోమీటరు దూరం వరకు వేరే ఇన్ఫినిక్స్ ఫోన్‌తో మాట్లాడటానికి ‘అల్ట్రా లింక్’ అనే ప్రత్యేక ఫీచర్ దీనిలో ఉంది.

ధర ఎంత ఉండొచ్చు?

కంపెనీ ఇంకా అధికారిక ధరను ప్రకటించలేదు. అయితే పాత మోడల్ Smart 10 ధర రూ.6,799గా ఉంది. దీన్ని బట్టి చూస్తే కొత్త Smart 20 ధర రూ.8,000 లోపే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే ధరలో వస్తే విద్యార్థులకు, బడ్జెట్ వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే దీని కెమెరా వివరాలు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గురించి తెలిసే వరకు ఆగడం మంచిది.

Also Read: గూగుల్‌లో మీకంటూ ఒక ప్రత్యేక ప్రొఫైల్‌.. ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసా?

Related News

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

Big Stories

Advertisement
×