E-Paper
Advertisement

AI Haircut Machine: 2 సెకన్లలో హెయిర్‌కట్.. వైరల్ అవుతున్న ఏఐ మెషీన్.. ఎక్కడ దొరుకుతుందంటే?

AI Haircut Machine: 2 సెకన్లలో హెయిర్‌కట్.. వైరల్ అవుతున్న ఏఐ మెషీన్.. ఎక్కడ దొరుకుతుందంటే?
Advertisement

AI Haircut Machine Fact Check | సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే తరహా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అన్ని వీడియోల్లో ఒక్కటే టాపిక్. 2 సెకండ్లలో పర్ఫెక్ట్ హెయిర్‌కట్ ఇచ్చే మ్యాజిక్ మెషీన్ కనిపిస్తోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఒక క్యాప్సూల్ లాంటి పెద్ద మషీన్. అందులో మనిషి తల పెడితే… 2 సెకండ్లలోనే తలపై జుట్టు ఆకారం మారిపోతుంది! మనిషి స్టైలిష్ హీరోలా బయటకు వస్తాడు. ఈ వీడియోలు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, రీల్స్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

ఈ వీడియోలు చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక బార్బర్ షాప్‌కి వెళ్లాల్సిన రోజులు పోయాయి! అని చెబుతున్నారు. కానీ ఈ వీడియోలు కనిపిస్తున్నదంతా నిజమేనా? లేక ఇది ఫేక్ వీడియో లేదా ఏఐతో తయారు చేసిన వీడియోనా అని అనుమానిస్తున్న వారు కూడా ఉన్నారు.

Advertisement

నిజం చెప్పాలంటే.. ఇది పూర్తిగా ఫేక్! అలాంటి మషీన్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఇలాంటి మెషీన్ తయారు చేసినట్లు చెప్పలేదు. ఏ ప్రోటోటైప్ కూడా రాలేదు. ఈ దృశ్యాలన్నీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో ఎడిటింగ్‌తో తయారు చేసిన మాయ మాత్రమే.

ఈ వీడియోని ఎలా ఎడిట్ చేసారంటే?..

ముందు ఒక వ్యక్తి సాధారణంగా కెమెరా ముందు కూర్చుంటాడు. రెండు రకాల జుట్టు స్టైల్స్‌తో రెండు వీడియోలు తీస్తారు లేదా ఫోటోలు ఉపయోగిస్తారు. తర్వాత ఒక 3D మోషీన్‌ని కంప్యూటర్‌లో తయారు చేసి, ఆ వ్యక్తి తల చుట్టూ సరిగ్గా అతికిస్తారు. ఏఐ సాఫ్ట్‌వేర్ జుట్టుని ఒక్కసారిగా మారుస్తుంది. ఆ వ్యక్తి జుట్టు అంతా అన్నీ ఒరిజినల్‌లా కనిపిస్తాయి. మోషన్ ట్రాకింగ్ వల్ల మెషీన్ తలతో పాటు కదులుతుంది. ఫలితంగా మనకు ఇదంతా 100 శాతం నిజమనిపిస్తుంది.

సోషల్ మీడియాలో నెటిజెన్ల రియాక్షన్స్ ఇలా ఉన్నాయి:

Advertisement

కొందరు “సూపర్ రా బాబు! నాకు కూడా కావాలి” అంటున్నారు. మరికొందరు “అయ్యో… ఇది హారర్ మూవీ మషీన్ లాగా ఉంది, తల కోసేస్తుందేమో!” అని భయపడుతున్నారు.
టెక్ ఎక్స్‌పర్ట్స్ ఈ వీడియోలు చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా నకిలీ వీడియో అని చెప్పారు. “ఇంటర్నెట్‌లో కనిపించిన ప్రతిదీ నమ్మొద్దు, ఇది డీప్ ఫేక్‌ లాగా ఉంది!” అని కామెంట్లు చేశారు.

నిజానికి మన జుట్టు అంత సులభంగా కట్ అయ్యేది కాదు. మనుషుల తల ఆకారం, జుట్టు మందం వేర్వేరుగా ఉంటుంది. దానికి బార్బర్ నైపుణ్యం, అవగాహన కావాలి. ఏఐ రోబోలు ఇంకా అంత స్మార్ట్ కాలేదు. ఇలాంటి మషీన్ రావాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పట్టొచ్చు.

ఈ మెషీన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిబట్టి తెలుస్తోంది. ఏఐ ఇప్పుడు ఎంత పవర్‌ఫుల్ అని. డీప్ ఫేక్ వీడియోలు అంతా నిజంలాగే ఉన్నాయి. కానీ ఇలాంటి వీడియోలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలను ఇతరులకు షేర్ చేసే ముందు అవి నిజమేనా అని చెక్ చేసుకోండి.

Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×