E-Paper
Advertisement

Tirumala laddu Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఏడు గంటలపాటు విచారణ, వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరి బిక్కిరి

Tirumala laddu Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఏడు గంటలపాటు విచారణ, వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరి బిక్కిరి
Advertisement

Tirumala laddu Adulterated Ghee Case: తిరుమల శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణతో దర్యాప్తు పూర్తి అయ్యిందా? వివరాలు క్రాస్ చెక్ చేసుకుని ఏమైనా అనుమానాలుంటే మరోసారి వైవీని విచారణకు పిలిచే అవకాశముందా? కొన్ని ప్రశ్నలకు తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారా? గత టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలను  తాము ఫాలో చేశామని చెప్పే ప్రయత్నం చేశారా? కేవలం నిబంధనలు మార్పులు, పీఏ అప్పన్న వ్యవహారంపై ఎక్కువగా సిట్ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

ఫైనల్ స్టేజ్‌కి తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసు

Advertisement

తిరుమల శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ పూర్తి అయ్యింది. గురువారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌‌లోని వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో ఆయన్ని దాదాపు ఏడుగంటలపాటు విచారించింది సిట్. ఒకానొక దశలో ఆయన్ని అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. రాత్రి ఏడు గంటల సమయంలో అధికారులంతా బయటకు రావడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

కల్తీ నెయ్యి వ్యవహారంలో రకరకాల కోణాల్లో వైవీ సుబ్బారెడ్డిని విచారించారు. ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న స్టేట్‌మెంట్‌, టీటీడీ బోర్డు ఛైర్మన్ హోదాలో టెండర్ల నిబంధనల సడలింపుపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న సిట్ అధికారులు, అవసరమైతే మళ్లీ విచారిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

ఏడు గంటలపాటు వైవీ సుబ్బారెడ్డి విచారణ

టీటీడీకి వివిధ సంస్థలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్ ఉందని, మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నిర్ధారించిన తర్వాత ఎందుకు కంటిన్యూ చేశారు? ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైష్ణవి డెయిరీలను 2024 వరకు ఎలా కొనసాగించారు? కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ విషయంలో మీపై ఒత్తిడి తెచ్చింది ఎవరు? కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తితిదే ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మీ దృష్టికి తెచ్చినా ఎందుకు స్పందించలేదు?

అలాగే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్న వాంగ్మూలాలు దగ్గరపెట్టి విచారించారు. కొన్ని అంశాలకు సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అత్యధిక శాతం ప్రశ్నలకు తనకు సంబంధం లేదని, టెండర్లు ఆహ్వానించడం, ఖరారు చేయడం అధికారులు చూసుకున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారట.

ALSO READ: కోర్టులో ఎదురుపడిన సునీతకు ఎదురుపడిన జగన్

దీనికి సంబంధించి ఏవైనావుంటే వాళ్లనే అడగాలంటూ మెలిక పెట్టినట్టు సమాచారం.  ఈ కేసు విచారణలో తొలుత నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ప్రతినిధులను విచారించారు. ఆ తర్వాత టీటీడీ ఉద్యోగుల వంతైంది. చివరగా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించారు సిట్ అధికారులు. ప్రస్తుతం వారిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన నివేదికను సుప్రీంకోర్టుకు ఇవ్వనుంది సిట్. విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చిన వైవీసుబ్బారెడ్డి, సిట్ ఏయే అంశాలు అడిగిందో చెప్పలేదు. ఫలానా విషయాలపై విచారించాలని చెప్పినట్టు తెలిపారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×