E-Paper
Advertisement

Top 20 News Today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

Top 20 News Today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

1. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం..

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. డిసెంబరు మూడో వారం కంటే ముందే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూలు ప్రకటించే అవకాశాలున్నాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

2. భద్రాచలంలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు అయింది. భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిని అడ్డాగా మార్చుకొని ఈ ముఠా కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సదరు లాడ్జిలో తనిఖీలు చేపట్టారు.

3. డిసెంబర్ 9తో.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది-సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9తో.. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటిలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ రైజింగ్ కోసం అందరి సహాయ సహకారాలు కావాలన్నారు. అందరికీ ఇదే ప్రభుత్వ ఆహ్వానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

4. బండి సంజయ్‌కు భారీ ఊరట

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు భారీ ఊరట లభించింది. 2023 పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో హనుమకొండ జిల్లా కమలాపూర్ పీఎస్ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. రాజకీయ కక్షల వల్లే తనపై కేసు నమోదు చేశారన్న సంజయ్ తరఫు లాయర్ వాదనను పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

5. సుప్రీం ఆదేశాలతో విచారణ వేగవంతం

సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ క్రమంలోనే దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ అందులో స్పష్టం చేశారు.

6. వైవీ సుబ్బారెడ్డిని సిట్ సుదీర్ఘ విచారణ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్‌లోని సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 8 గంటల పాటు ఆయనను సిట్ బృందం విచారించింది.

7. జనసేప పార్టీలో మరోసారి విభేదాలు..

కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. జనసేనలో జిమ్మిక్కులు అనే పోస్టులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ రామకృష్ణ పెట్టిన పోస్టులు పార్టీలో ఉన్న విభేదాలను బయటపడ్డాయి.

8. ఐ-బొమ్మ రవి మొదటి రోజు విచారణ పూర్తి

ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి మొదటి రోజు విచారణ పూర్తయింది. ఇందులో భాగంగా పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రవి బ్యాంక్ లావాదేవీలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. రవి నెట్‌వర్క్, ఇంటర్నేషనల్ సోర్సుపై కూడా విచారణ చేపట్టారు. ఇదే కేసులో రవిని మరో నాలుగు రోజులపాటు విచారించనున్నారు పోలీసులు.

9. భార్య, పిల్లల్ని హత్య కేసులో కోర్టలు సంచలన తీర్పు

భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు వెల్లడించింది వికారాబాద్ జిల్లా కోర్టు. 2019లో తన భార్య, ఇద్దరు పిల్లల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ప్రవీణ్ అనే వ్యక్తి. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించాడు. హత్య కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి సంచలనాత్మక తీర్పునిచ్చారు.

10. ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

కరీంనగర్ జిల్లా విద్యాధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయుడు ఐలయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా, హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, సమ్మయ్యలపై మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు రావడంతో, అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

11. మావోయిస్టుల అరెస్ట్ కేసులో సంచలన విషయాలు

విజయవాడ మావోయిస్టుల అరెస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్మ్స్ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర పన్నారనే అంశాన్ని ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. నిందితుల నుంచి పోలీసులు 22 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
సంచలన విషయాలు

12. కామారెడ్డిలో సైబర్ మెసం

కామారెడ్డి జిల్లా బీబీపేటలో సైబర్ మోసం కలకలం రేపింది. వాట్సాప్‌ ద్వారా లింకులు పంపి ఓ బాధితుడి నుంచి 6 లక్షల రూపాయలు కాజేశారు సైబర్ మోసగాళ్లు. చివరకు అదనంగా డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి బీబీపేట్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

13. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి..

రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది.

14. లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు

నెల్లూరు లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు చేసింది విజయవాడ కోర్టు. ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ కోర్టును అరుణ కోరారు. ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

15. శ్రీ పద్మావతీ అమ్మవారికి కానుకగా 8 గొడుగులు

తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు చెన్నైకి చెందిన దాత అమ్మవారికి 8 గొడుగులను బహుకరించారు. తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు జిల్లాకు చెందిన భాష్య కార్య కైంకర్య ట్రస్ట్ ఛైర్మన్ వెంపటి మాధవ నాయుడు గొడుగులను అమ్మవారి ఆలయ మండపంలో ఆలయ అధికారులకు అందించారు.

16. మావోయిస్టులు అమర్చిన 10 కిలోల IED నిర్వీర్యం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం చిహ్కా–ఉస్పరి రహదారిపై మావోయిస్టులు అమర్చిన 10 కిలోల IEDని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. భైరామ్‌గఢ్ పోలీసులు, బీజాపూర్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో స్టీల్ టిఫిన్‌ బాక్స్‌లో దాచిన సుమారు 10 కిలోల బరువున్న కమాండ్ IED బయట పడింది. వెంటనే బీజాపూర్ BDS బృందం ఆ పేలుడు పదార్థాన్ని అత్యంత జాగ్రత్తతో అక్కడికక్కడే నిర్వీర్యం చేసింది.

17. డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

తాజాగా జరిగిన అమెరికా-సౌదీ పెట్టుబడుల ఫోరమ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఉందని అన్నారు. విదేశీ వృత్తి నిపుణులు వేల మందిని తమతో తీసుకురావాలని, వారిని స్వాగతిస్తానని ట్రంప్‌ తెలిపారు. అమెరికాలోని కంపెనీల్లో బిలియన్‌ డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టే వారిని అనుమతించకపోతే తాము విజయం సాధించలేమని అన్నారు.

18. అఖండ 2 తాండవం ట్రైలర్ నేడు విడుదల

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సెన్షేషన్ అఖండ 2 తాండవం మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్, సెకండ్ సింగిల్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇవాళ కర్ణాటకలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది.

19. డెఫ్‌లింపిక్స్‌లో భారత్ సత్తా

డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్లు అభినవ్‌ దేశ్వాల్, ప్రాంజలి సత్తా చాటారు. 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో ఈ జోడీ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో ప్రాంజలి జోడి 16-6తో చైనీస్‌ తైపీకి చెందిన యా యు కావ్, మింగ్‌ జుయి సు జోడీని చిత్తు చేసి విజయం సాధించింది.

20. భారత జట్టుకు దూరమైన హార్దిక్‌ పాండ్యా

గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పునరాగమనం మరింత ఆలస్యం కాబోతోంది. ఈనెల 30న దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో హార్దిక్‌ ఆడతాడని అనుకున్నా.. అది సాధ్యం అయ్యేలా లేదు. అతడి ఫిట్‌నెస్‌ను పూర్తిగా పరీక్షించాకే జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×