E-Paper
Advertisement

Highest Selling smartphone 2025: భారత్‌లో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా iPhone 16.. పదకొండు నెలల్లో 6.5 కోట్ల యూనిట్ల విక్రయం!

Highest Selling smartphone 2025: భారత్‌లో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా iPhone 16.. పదకొండు నెలల్లో 6.5 కోట్ల యూనిట్ల విక్రయం!
Advertisement

Highest Selling smartphone 2025: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ ఏడాది ఓ ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. బడ్జెట్, మిడ్‌రేంజ్ ఫోన్లతో నిండిన మార్కెట్‌లో, ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ iPhone 16 దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా అవతరించింది. కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 22025లో మొదటి 11 నెలల్లో ఆపిల్ ఐఫోన్ 16 మొబైల్స్ 6.5 కోట్ల యూనిట్లను విక్రయించింది.

యూజర్ల అభిరుచుల్లో మార్పులు:

2024లో విడుదలైన iPhone 16కు, iPhone 17 మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత కూడా డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. అందుబాటులోకి వచ్చినప్పుడల్లా కస్టమర్లు ఈ మోడల్‌ను ఎంచుకోవడంతో, యాపిల్ ఈ ఘనత సాధించగలిగింది. ఇది భారత వినియోగదారుల అభిరుచుల్లో వస్తున్న మార్పుకు స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు.

Advertisement

Also Read: యాపిల్ నుంచి పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్‌.. ట్రిపుల్ రియర్ కెమెరాతో iPhone 18 Pro Max విడుదలకు సిద్ధం!

11 నెలల్లో 6.5 కోట్ల యూనిట్ల విక్రయం:

తాజాగా కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. 2025లో మొదటి 11 నెలల కాలంలో ఐఫోన్ 16 అమ్మకాలు 6.5 కోట్ల యూనిట్లకు చేరాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న వివో Y29 5G సుమారు 4.7 కోట్ల యూనిట్లతో సరిపెట్టుకుంది.

ధర ఎక్కువైనా తగ్గని డిమాండ్:

Advertisement

ఇక ధర పరంగా చూస్తే.. iPhone 16 ఖరీదు వివో Y29 5G కంటే దాదాపు మూడింతలు ఎక్కువ. అయినప్పటికీ, అమ్మకాలలో ఈ స్థాయి తేడా కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టాప్ సెల్లింగ్ ఫోన్లలో సాధారణంగా బడ్జెట్ ఫోన్లు ఉంటాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇక మూడో స్థానంలో iPhone 15 నిలిచింది. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది భారతదేశంలో అమ్ముడైన స్మార్ట్‌ఫోన్లలో సుమారు 8% వాటా కేవలం iPhone 16, iPhone 15 మోడళ్లదే కావడం విశేషం.

iPhone 16 స్పెసిఫికేషన్లు:

సెప్టెంబరు 2024లో లాంచ్ అయిన iPhone 16, 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో ఉన్న A18 ప్రాసెసర్ మల్టీటాస్కింగ్‌కు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తుంది. పనితీరుతో పాటు పవర్ ఎఫిషియెన్సీ పరంగా కూడా ఈ చిప్ ప్రత్యేకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు ఇది సిద్ధంగా ఉండేలా డిజైన్ చేశారు.

22 గంటల ప్లేబ్యాక్:

iPhone 16 కెమెరా విభాగంలో వెనుక భాగంలో 48MP + 12MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందించే సామర్థ్యం దీనికి ఉంది.

భారత్‌పై ఫోకస్ పెట్టిన యాపిల్:

ఇటీవలి కాలంలో యాపిల్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తయారీ పరంగా చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. భారత్‌కు అసెంబ్లీ లైన్‌లను క్రమంగా తరలిస్తోంది. దీని ఫలితంగా భారతదేశం నుంచి యాపిల్ ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. అదే సమయంలో, యాపిల్ తన రిటైల్ విస్తరణను కూడా వేగవంతం చేసింది.

కీలక తయారీ కేంద్రంగా భారత్:

ఈ ఏడాది బెంగళూరు, పూణే, నోయిడాలో మూడు కొత్త యాపిల్ స్టోర్‌లను ప్రారంభించడం అందుకు ఉదాహరణ. అంతర్జాతీయ టారిఫ్‌లు, వాణిజ్య ఒత్తిళ్ల నేపథ్యంలో, భారత్‌ను కీలక తయారీ కేంద్రంగా మార్చుకోవాలనే దిశగా యాపిల్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read: ఒక్కసారిగా రెండు గేమింగ్ బీస్ట్స్ లాంచ్.. Honor ఫ్యాన్స్‌కు అసలైన పండగ మొదలైంది!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×