E-Paper
Advertisement

యాపిల్ నుంచి క్రేజీ అప్డేట్.. అత్యాధునిక ఫీచర్లు, క్రేజీ కలర్స్‌లో రాబోతున్న iPhone 18 Pro!

యాపిల్ నుంచి క్రేజీ అప్డేట్.. అత్యాధునిక ఫీచర్లు, క్రేజీ కలర్స్‌లో రాబోతున్న iPhone 18 Pro!
Advertisement

iPhone 18 Pro: ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా టెక్ ప్రపంచం యాపిల్ కొత్త ఐఫోన్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న iPhone 18 Pro సిరీస్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా, ప్రాసెసర్ విషయంలో ఈసారి సంస్థ భారీ మార్పులకే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు?

iPhone 18 Pro మోడల్స్ సెప్టెంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. తయారీ ఖర్చులు పెరిగినప్పటికీ.. అమెరికా మార్కెట్‌లో దీని ప్రారంభ ధరను గతేడాది తరహాలోనే 1,099 డాలర్లుగా ఉంచాలని యాపిల్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. భారతదేశంలో పన్నులు, ఇతర కారణాల వల్ల iPhone 17 సిరీస్ లాగే దీని ధర కూడా కొంత అదనంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఆకట్టుకునే రంగులు, డిజైన్..

Advertisement

ఈసారి కలర్స్ విషయంలో యాపిల్ కొత్త ప్రయోగాలు చేస్తోంది. డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, డార్క్ గ్రే వంటి సరికొత్త రంగుల్లో ఈ ఫోన్లు మెరిసిపోనున్నాయి. ముఖ్యంగా ‘డీప్ రెడ్’ వేరియంట్ ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలవనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే.. ఫోన్ వెనుక ఉండే కెమెరా ప్యానెల్ మునుపటి కంటే కొంచెం మందంగా, ప్రీమియం లుక్‌తో ఉండబోతోంది. ఫోన్ బాడీ, గ్లాస్ మధ్య తేడా తెలియకుండా చాలా ఫినిషింగ్‌తో దీన్ని రూపొందిస్తున్నారు.

డిస్‌ప్లేలో ఊహించని మార్పు..

ఈ iPhone 18 Proలో 6.3 అంగుళాల డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. అయితే ఈసారి ప్రధాన మార్పు డైనమిక్ ఐలాండ్ విషయంలో ఉండబోతోంది. అండర్ డిస్‌ప్లే ఫేస్ ఐడి టెక్నాలజీని వాడటం వల్ల, డిస్‌ప్లే పైభాగంలో ఉండే ఆ నాచ్ సైజు దాదాపు 35 శాతం తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల స్క్రీన్ మరింత పెద్దదిగా, స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

Also Read: OnePlus Pad 4 వచ్చేసింది.. ల్యాప్‌టాప్‌ను మర్చిపోయేలా చేసే ఏఐ ఫీచర్లు.. వావ్ అనిపించేలా బ్యాటరీ!

బ్యాటరీ విషయానికి వస్తే..

ఈ కొత్త ఫోన్లలో అత్యంత శక్తివంతమైన ఏ20 ప్రో చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఇది పాత వాటి కంటే 30 శాతం వేగంగా పనిచేస్తూనే, బ్యాటరీని తక్కువగా ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా.. యాపిల్ సొంతంగా తయారు చేసిన సీ2 మోడెమ్‌ను దీని ద్వారా పరిచయం చేయబోతున్నారు. దీనివల్ల ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా.. శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా అత్యవసర సమయాల్లో కమ్యూనికేట్ చేయడం సులభమవుతుంది.

ప్రొఫెషనల్ కెమెరా అప్‌గ్రేడ్స్..

కెమెరా ప్రియుల కోసం ఈసారి యాపిల్ ఒక ప్రత్యేకమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే మెకానికల్ వేరియబుల్ అపెర్చర్ సిస్టమ్. దీనివల్ల తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయడం, ఫొటోలో నాయిస్ తగ్గించడం వంటి విషయాల్లో ఈ కెమెరా సెటప్ గత మోడల్స్ కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ప్రొఫెషనల్ కెమెరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని పనితీరు ఉండబోతోంది.

Also Read: ఇంత తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ ఫోనా? Motorola Edge 30 Proపై దిమ్మతిరిగే ధర తగ్గింపు!

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×