E-Paper
Advertisement

iPhone 200MP: ఐఫోన్‌ కొత్త మోడల్‌లో 200MP కెమెరా.. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఆపిల్ షాక్

iPhone 200MP: ఐఫోన్‌ కొత్త మోడల్‌లో 200MP కెమెరా.. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఆపిల్ షాక్
Advertisement

iPhone 200MP Camera| ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీ ఆపిల్ అత్యధిక రిజల్యూషన్ కెమెరా రేసులోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. తాజా లీక్స్ ప్రకారం.. కంపెనీ 200MP కెమెరా సెన్సార్‌ను పరీక్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ తెచ్చే కెమెరా ఫోన్ విప్లవాత్మక మార్పు తీసుకురాబోతోంది.

200MP కెమెరా సెన్సార్‌ టెస్ట్ చేస్తున్న ఆపిల్

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన సమాచారం ప్రకారం.. ఆపిల్ ప్రస్తుతం 200MP కెమెరా సెన్సార్‌ను పరీక్షిస్తోంది. ఈ సెన్సార్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది.

Advertisement

ఈ లీక్ ప్రకారం, ఈ సెన్సార్ సైజు సుమారు 1/1.12 అంగుళాల వరకు పెద్దదిగా ఉండవచ్చు. పెద్ద సెన్సార్ ఎక్కువ లైటింగ్‌ని సంగ్రహించడానికి సహాయపడుతుంది, వీడియో క్వాలిటీని మెరుగుపరుస్తుంది. అయితే, ఈ కొత్త కెమెరా టెక్నాలజీకి సంబంధించి ఆపిల్ ఎలాంటి అధికారిక ప్రణాళికలను ఇంకా ధృవీకరించలేదు.

200MP కెమెరా ఐఫోన్‌ లాంచ్ ఆలస్యం

ఆపిల్ చేస్తున్న 200MP కెమెరా ఐఫోన్‌ టెస్టింగ్‌లో ఉండడంతో తక్షణమే వచ్చే ఐఫోన్ 18 లాంటి మోడల్స్‌లో ఈ పెద్ద కెమెరా ఉండకపోవచ్చు. ఇప్పటికే ఐఫోన్ 18 సిరీస్‌కు సంబంధించి అనేక లీక్‌లు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

ఈ లీక్‌లలో 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ప్రస్తావన లేదు. అంటే ఆపిల్ ఈ ఫీచర్‌ను ఇప్పటికప్పుడు విడుదల చేయకపోవచ్చని తెలుస్తోంది. తుది నిర్ణయం తీసుకునే ముందు కంపెనీ ఈ టెక్నాలజీని అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రధాన కెమెరాపై మాత్రమే దృష్టి

ఆపిల్ ఈ సెన్సార్‌ను ప్రధాన కెమెరా కోసం మాత్రమే పరీక్షిస్తోందని లీక్ పేర్కొంటోంది. కెమెరా సెటప్‌లోని అన్ని లెన్స్‌ల కోసం దీన్ని పరీక్షించడం లేదు.

అంటే ఒకే పరికరంలో ఆపిల్ మల్టీ 200 ఎంపీ సెన్సార్‌లను ఉపయోగించకపోవచ్చు. బదులుగా, ప్రధాన కెమెరా పర్‌ఫామెన్స్‌ని మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ భారీ మార్పు ఆపిల్ సాధారణ హార్డ్వేర్ అప్గ్రేడ్‌లో భాగం.

ఆపిల్ ప్రత్యేక కెమెరా విధానం

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో ఆపిల్ ఎల్లప్పుడూ భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తోంది. కంపెనీ సాఫ్ట్‌వేర్ ప్రాసెసింగ్‌, ఏఐ మెరుగుదలలపై ఎక్కువ దృష్టి పెడుతుంది.

మెగాపిక్సెల్స్ పెంచడానికి బదులు, కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ టెక్నిక్‌ల ద్వారా వీడియో క్వాలిటీని ఆపిల్ మెరుగుపరుస్తోంది. ఇందులో మెరుగైన కలర్ కచ్చితత్వం, డైనమిక్ రేంజ్, తక్కువ లైటింగ్‌లో కూడా మంచి పర్‌ఫామెన్స్ ఇస్తుంది.

ఆపిల్ కంటే ముందున్న రైవల్ కంపెనీలు

వివో, ఒప్పో లాంటి ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఇప్పటికే అత్యధిక రిజల్యూషన్ కెమెరాలను దూకుడుగా తీసుకురావడం ప్రారంభించాయి. ఒప్పో, వివో వంటి కంపెనీలు ఈ ట్రెండ్‌‌లో ముందుగా ఉన్నాయి.

ఒప్పో తన రాబోయే ఫైండ్ ఎక్స్9 అల్ట్రాలో డ్యుయెల్ 200MP కెమెరాలను ప్రవేశపెట్టవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో ప్రధాన సెన్సార్, పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉండవచ్చు.

వినియోగదారులపై ప్రభావం

ఆపిల్ 200MP కెమెరా సెన్సార్‌తో ఫోన్ లాంచ్ చేస్తే.. వినియోగదారులు మరింత పదునైన డీటెయిలింగ్ ఫోటోలను ఆశించవచ్చు. ఎక్కువ మెగాపిక్సెల్స్ క్వాలిటీని కోల్పోకుండా ఫొటోలు క్రాప్ చేసుకోవడానికి సహాయపడతాయి.

అయితే, తుది వీడియో అవుట్‌ఫుల్‌లో సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. హార్డ్‌వేర్ అప్గ్రేడ్‌లను అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్‌తో కలపడానికి ఆపిల్ అవకాశం ఉంది. ఈ అడ్వాన్స్ కెమెరాతో వచ్చే భవిష్యత్ ఐఫోన్‌లు ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకుంది.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

అత్యధిక రిజల్యూషన్ కెమెరా టెక్నాలజీపై ఆపిల్‌కు ఉన్న ఆసక్తిని ఈ లీక్ హైలైట్ చేస్తోంది. అయితే, ఈ ఫీచర్‌ను వెంటనే ఆశించడం చాలా తొందరపాటు అవుతుంది.

సెన్సార్‌ను మెరుగుపరచడానికి, సరిగ్గా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఆపిల్ సమయం తీసుకోవచ్చు. అప్పటి వరకు సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫోటోగ్రఫీకే ప్రాధాన్యం ఇస్తుంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×