E-Paper
Advertisement

Road Accident: పండుగ వేళ ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం

Road Accident: పండుగ వేళ ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం
Advertisement

Road Accident: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అయితే మృతులను విశాఖపట్నం నగరానికి చెందిన నాగమణి (59), ఆమె కుమారుడు నరేంద్ర కుమార్ (32)గా గుర్తించారు. వీరిద్దరూ వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బైక్ వేగంగా ఉండటం, లారీని గమనించే లోపే ప్రమాదం జరిగిపోవడంతో.. వాహనం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డు అయ్యాయి. బైక్ ఎంత వేగంతో వచ్చి లారీని ఢీకొట్టిందో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. హెల్మెట్ ధరించినప్పటికీ, ఢీకొన్న తీవ్రత ఎక్కువగా ఉండటంతో తలలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఘోరం.. మార్కాపురం బస్సు ప్రమాదంలో కొడుకుని కాపాడి తల్లి మృతి

Advertisement

జాతీయ రహదారులపై వాహనాలను నిలిపేటప్పుడు సరైన హెచ్చరిక సంకేతాలు లేకపోవడం, మితిమీరిన వేగం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భారీ వాహనాలు ఆగి ఉన్న చోట వేగాన్ని నియంత్రించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×