iQOO 15 vs Realme GT 8 Pro vs Oppo Find X9 Comparison | ఇటీవలే కొన్ని రోజుల వ్యవధిలోనే భారత మార్కెట్‌లో మూడు టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. మూడు ఫోన్లు కూడా ఫీచర్ల పరంగా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీపడుతున్నాయి. తాజాగా లాంచ్ అయిన iQOO 15ని కొన్ని రోజుల క్రితం విడుదలైన Realme GT 8 Pro, ప్రీమియం లుక్‌తో వచ్చిన Oppo Find X9 రెండు ఫోన్లు గట్టిపోటీనిస్తున్నాయి. ఈ మూడు ఫోన్లలో ఏది కొనుగోలు చేయాలో, ఏది మీకు సరైనదో ఈ సింపుల్ పోలికతో తెలుసుకోండి.
ఐకూ 15, రియల్ మి GT 8 ప్రో.. రెండూ ఒకటే బేస్ మోడల్ (12GB+256GB) తో వచ్చాయి. వీటి ధర కూడా రూ.72,999. కానీ టాప్ వేరియంట్‌లో రియల్ మి GT 8 ప్రో పెద్ద వేరియంట్‌ని (16GB+512GB) కేవలం రూ.78,999కే ఇస్తోంది, కానీ iQOO 15 ఈ పెద్ద వేరియంట్‌ని కాస్త ఎక్కువ ధర రూ.79,999 ఇస్తోంది.
మరోవైపు ఒప్పో ఫైండ్ X9 మాత్రం కొంచెం ఖరీదు. దీని బేస్ మోడల్ రూ.74,999, టాప్ మోడల్ రూ. 89,999 వరకు ఉంటుంది.
డిస్‌ప్లే విషయానికొస్తే ఐకూ 15లో 6.85 అంగుళాల పెద్ద 2K Samsung AMOLED స్క్రీన్ ఉంది. ఇది చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. రియల్ మి GT 8 ప్రోలో 6.79 అంగుళాల BOE AMOLED స్క్రీన్ ఉంది, ఇది కూడా 144Hz రిఫ్రెష్ రేట్. ఒప్పో ఫైండ్ X9 స్క్రీన్ సైజు మాత్రం చిన్నది. 6.59 అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే. పెద్ద స్క్రీన్ కావాలంటే ఐకూ 15 బెస్ట్.
పర్ఫామెన్స్‌లో iQOO 15, Realme GT 8 Pro రెండూ కొత్త Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వచ్చాయి. హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లో ఇవి సూపర్‌గా ఉంటాయి. Oppo Find X9లో మిడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ ఉంది. ఇది కూడా చాలా వేగవంతమే కానీ Snapdragon కంటే కొంచెం స్లో.
కెమెరా విషయంలో Realme GT 8 Proలో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండటం పెద్ద ప్లస్. దూరంలోని ఫోటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. iQOO 15లో మూడు 50MP కెమెరాలు + పెరిస్కోప్ జూమ్ ఉంది. Oppo Find X9లో నాలుగు కెమెరాలు ఉన్నాయి, వీటిలో మూడు 50MP. కలర్స్, పోర్ట్రెయిట్ ఫోటోలు చాలా అందంగా వస్తాయి.
బ్యాటరీలో మూడు ఫోన్లు దాదాపు సమానం. iQOO 15, Realme GT 8 Proలో 7000mAh, Oppo Find X9లో 7025mAh బ్యాటరీ ఉంది. కానీ ఛార్జింగ్ స్పీడ్‌లో Realme GT 8 Pro 120W వైర్డ్ ఛార్జింగ్‌తో ముందుంది – కేవలం 25-30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
మూడు ఫోన్ల బరువు చూస్తే Oppo Find X9 చాలా లైట్ (203 గ్రాములు), Realme 214 గ్రాములు, iQOO 15 కొంచెం భారీగా అంటే 220 గ్రాములు ఉంటుంది.
గేమింగ్, పెద్ద బ్రైట్ స్క్రీన్ కావాలంటే iQOO 15. డబ్బుకి ఎక్కువ వాల్యూ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, బెస్ట్ జూమ్ కెమెరా కావాలంటే Realme GT 8 Pro (ఇది నా టాప్ పిక్!). ప్రీమియం డిజైన్, లైట్ బరువు, అందమైన ఫోటోలు కావాలంటే Oppo Find X9. మీ బడ్జెట్, ఉపయోగాలను బట్టి ఎంచుకోండి. 2025 సంవత్సరం చివరిలో విడుదలైన ఈ మూడు ఫోన్లు కూడా టాప్ ఫ్లాగ్‌షిప్‌లే!