E-Paper
Advertisement

Stree Nidhi MD: శ్రీనిధిలో సిత్రాలు.. 14 ఏళ్ల నుండి ఓకే వ్యక్తి ఎండీగా విధులు..?

Stree Nidhi MD: శ్రీనిధిలో సిత్రాలు.. 14 ఏళ్ల నుండి ఓకే వ్యక్తి ఎండీగా విధులు..?
Advertisement

Stree Nidhi MD: స్వేచ్ఛ బ్యూరో: ఒకే వ్యక్తి ఒకే పోస్టులో ఏకంగా 14 ఏళ్లుగా కొనసాగుతుండటం గమనార్హం. ఎవరైనా అర్నెల్లో ఏడాదిరెండేండ్లో కొనసాగుతారు. ఆయన మాత్రం ఆశాఖను వదిలి పెట్టడం లేదు. రిటైర్ అయినప్పటికీ పెరవీలు చేసుకుంటూ రెన్యూవల్ చేసుకుంటూ కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తుంది. ఆశాఖను నడిపేందుకు రాష్ట్రంలో సమర్ధవంతమైన అధికారులే లేరా? అనేది ఇప్పుడు విస్తృత చర్చజరుగుతుంది. ఎందుకు ఆయనకు పెద్దపీటవేస్తున్నారని అందులో ఆంతర్యమేంటి.. ఆయనకు ఎవరు అండగా ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

14 ఏళ్లుగా కొనసాగింపు..

మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు శ్రీనిధిని ఏర్పాటు చేసుకున్నారు. మహిళా సమాఖ్య లచే మొబైల్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రుణాలను అందించే సంస్థను మండల/పట్టణ సమాఖ్యల భాగస్వామ్యంతో, రాష్ట ప్రభుత్వ సహ కారంతో ఏర్పాటు చేసిన సంస్థ స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య”. ఈ సంస్థ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతుంది. ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వమే అధికారులను నియమిస్తుంది. అయితే ఈ సంస్థకు ఒకే వ్యక్తిని అదీనూ రిటైర్ అయిన అతడిని 14 ఏళ్లుగా కొనసాగిస్తుండటం ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జీ విద్యాసాగర్ రెడ్డి..

Advertisement

2009 లో రిటైర్డ్ అయిన జీ విద్యాసాగర్ రెడ్డి 2011 సంవత్సరం నుంచి నేటి వరకు మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆయనను ఎందుకు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కో ఆపరేటివ్ నిబందనను అనుసరించి ఎం.డీ హోదా లో 3 సంవత్స రాలు ఉండాలి. కోఆపరేటివ్ నిబంధన సెక్షన్ 28 ప్రకారం ఆఫీసర్ స్థాయి వ్యక్తి 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలి. కానీ ఈ నిబంధన లేని పట్టించుకో కుండా ఇంకా పదవిలో కొనసాగుతుండడం గమనార్హం. ఆర్బీఐ నిబంధన అనుసరించి ఎం.డీ హోదాలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కొనసాగాల్సి ఉండగా దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం నుండి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఎందుకు ఆయనకు పెద్దపీట వేశారనేది ఇప్పుడు ఉద్యోగులతో పాటు మహిళా సంఘాల్లోనూ చర్చజరుగుతుంది.

Also Read: Bhadrachalam LIC: బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు సృష్టించి రూ.1.52 కోట్లు కొట్టేసిన భీమా సంస్థ ఏజెంట్లు..?

మళ్లీ ప్రయత్నాలు?

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం అన్నిశాఖల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల తొలిగింపు ప్రక్రియను గతేడాది చేపట్టింది. అందులో భాగంగా విద్యాసాగర్ రెడ్డి ని తొలగించింది. మళ్లీ 11ఏప్రిల్ 2025న తిరిగి రెన్యూవల్ చేసింది. అయితే ఈ ఏడాది మే 23తో పదవికాలం పూర్తవుతుంది. అయితే మళ్లీ రెన్యూవల్ కోసం పైరవీలు ప్రారంభించారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సుదీర్ఘకాలంగా ఒకే శాఖలో పనిచేస్తుండటంతో ప్రభుత్వ పనితీరుపైనా ఆరోపణలు వస్తున్నాయి.ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమర్ధవంతమైనవారు లేరా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకే వ్యక్తిని ఎందుకు శ్రీనిధి ఎండీగా కొనసాగిస్తున్నారు?.. ఎవరి సహకారం ఉంది.. అసలు శాఖలో ఏం జరుగుతుందనేదనేద విస్తృత చర్చజరుగుతుంది. శ్రీనిధి ఎండీగా ఎవరికి అప్పగించినా నిర్వర్తించలేరా? ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా? లేదా అనేది హాట్ టాపిక్ అయింది.

ఎంక్వాయిరీ జీఓ ఉండగానే రెన్యూవల్..

శ్రీనిధిలో ఎండీ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల పై వేధింపులు, సిమ్ కార్డుల కొనుగోళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల తొలగింపు,సీఎస్ఆర్ నిధుల నిధుల దుర్వినియోగం, పోన్ టాపింగ్ వంటి ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదులు సైతం రావడంతో 13 సెప్టెంబర్ 2024లో ప్రభుత్వం జీవో 523 జారీ చేసింది. నలుగురు ఐఏఎస్ అధికారుల బృందంతో కూడి కమిటీ వేసి ఎంక్వాయిరీకి ఆదేశించారు. రెండు నెలల్లోనే పూర్తి రిపోర్టు ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. కానీఏడాదిన్నర పూర్తి కావస్తున్నా ఎంక్వయిరీ ఊసేలేదని సమాచారం. ఎంక్వాయిరీ జీఓ ఓండగానే 10 అక్టోబర్ 2024న రెన్యువల్ చేస్తూ జీవో 64 జారీచేయడం, తిరిగి మళ్లీ ఎండీగా విద్యాసాగర్ రెడ్డినే కొనసాగిస్తుండటం విస్తృత చర్చజరుగుతుంది.

మంత్రికి తెలుసా? తెలియదా?

స్త్రీ నిధి ఎండీపై ఆరోపణలు రావడం, ఎంక్వాయిరీ కమిటీని సైతం ప్రభుత్వ వేసిన విషయాలు, సుదీర్ఘంగా 14 ఏళ్లపాటు ఒకేశాఖలో రిటైర్డ్ అయిన ఉద్యోగి కొనసాగుతుండటం తదితర అంశాలు మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రికి తెలుస్సా? తెలియదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలిస్తే అతడిని ఎందుకు కొనసాగుతున్నారనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. కోఆపరేటీవ్ నిబంధనల ప్రకారం 3 ఏళ్లు మాత్రమే కొనసాగాలని ఉన్నప్పటికీ ఎందుకు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారనేది ప్రభుత్వానికే తెలియాలి. ఇప్పటికైనా స్త్రీనిధిపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందా? లేక చూసిచూడనట్లు వ్యవహరిస్తుందా? అనేది చూడాలి.

Also Read: Stock market crash: యుద్ధం సెగలు.. వణికిన దలాల్ స్ట్రీట్, ప్రారంభంలో భారీగా పతనమైన సూచీలు

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×