iQOO 16: టెక్ ప్రియులకు ఐకూ అనగానే పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ గుర్తుకొస్తుంది. తాజాగా ఈ కంపెనీ నుంచి iQOO 16 సిరీస్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలోనూ అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ IMEI డేటాబేస్‌లో ఈ ఫోన్ మోడల్ నెంబర్ I2601తో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చైనాలో విడుదలైన కొద్దిరోజుల్లోనే ఇది భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సరికొత్త ఫోన్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అప్‌కమింగ్ పవర్‌ఫుల్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో+ ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఇది కేవలం గేమింగ్‌కే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌లను చాలా వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు దీనిలో అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌తో పాటు ఐకూ సొంత పెర్ఫార్మెన్స్ చిప్‌ను కూడా జోడించబోతున్నారు.
Also Read: గూగుల్ నుంచి బిగ్ లీక్.. Pixel 11లో ఈ ‘పిక్సెల్ గ్లో’ ఫీచర్ చూస్తే ఫ్యూజులు అవుట్!
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఈ iQOO 16 మోడల్‌లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఇదొక సంచలనంగా మారుతుంది. హెవీ గేమర్లకు, రోజంతా ఫోన్ వాడేవారికి ఛార్జింగ్ గురించిన చింతే ఉండదు.
ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. దీనిలో వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను ఇస్తున్నారు. దీనివల్ల చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా క్లారిటీ తగ్గకుండా జూమ్ చేసి ఫొటోలు తీసుకోవచ్చు. పాత మోడల్స్‌తో పోలిస్తే.. iQOO 16లో కెమెరా క్వాలిటీ చాలా అద్భుతంగా ఉండబోతోంది.
గతంలో వచ్చిన iQOO 15 ఫోన్ ఫీచర్లతో పోలిస్తే.. ఈ కొత్త మోడల్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. టాప్ ఎండ్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ కెమెరాతో వస్తుండటంతో ఈ ఫోన్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ విభాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ దీని ధరపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పవర్‌ఫుల్ ఫోన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.