E-Paper
Advertisement

రైలుపై ఆత్మాహుతి దాడి.. రెండు డజన్లు పైగానే మృతులు, మరో 70 మందికి గాయాలు

రైలుపై ఆత్మాహుతి దాడి.. రెండు డజన్లు పైగానే మృతులు, మరో 70 మందికి గాయాలు
Advertisement

Quetta: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు తెగబడుతున్నారు. తాజాగా రైల్వే ట్రాప్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు రెండు డజన్ల వరకు మృత్యువాత పడ్డారు. మరో దాదాపు ఆరు డజన్ల వరకు గాయపడ్డారు. ఈ దాడితో అక్కడ ప్రాంతం బీతావహంగా మారింది. అసలేం జరిగింది?

క్వెట్టాలోని చమన్ ఫాటక్ సమీపంలోని రైలుపై ఆత్మాహుతి దాడి

Advertisement

పాకిస్థాన్‌లో క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్‌ దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగానే గాయపడ్డారు. కొందరు ఆర్మీ జవాన్లు, వారి కుటుంబాలతో ప్రయాణిస్తున్న రైలు.. చమన్ ఫాటక్ స్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ దాటుతోంది. అప్పటికే పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీ కొట్టింది.

ఈ విషయాన్ని పాక్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువమంది సైనికులు ఉన్నారని తెలిపారు. పేలుడు దాటికి రైలు పాక్షకంగా దెబ్బతింది. ఆత్మాహుతి దాడిలో 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో పేలుడు జరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

26 మంది మృతి.. 70 మందిపైగా గాయాలు,  సైనిక కుటుంబాలకు చెందినవారు

ఆత్మాహుతి దాడి తర్వాత క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను సమీపంలోని స్టేషన్‌లో నిలిపి వేశారు. ఫలితంగా మూడు కోచ్‌లు, ఇంజిన్ పట్టాలు తప్పాయి. మరో రెండు బోల్తా పడ్డాయని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఈద్ పండుగ కోసం ఇళ్లకు తిరిగి వెళ్తున్న సైనిక సిబ్బంది, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంది బీఎల్ఏ.

ఈ దాడిని తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. పిరికిపంద చర్యలు పాకిస్తాన్ ప్రజల సంకల్పాన్ని బలహీనపరచలేవన్నారు. ఈ సమయంలో యావత్ దేశం బలూచిస్తాన్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుందన్నారు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం.

ALSO READ: ఎట్టకేలకు ఎండ్ కార్డు పడినట్టే.. ఇరాన్ సిద్దమైందన్న ట్రంప్, రేపో మాపో ఒప్పందంపై సంతకాలు

రైల్వే‌స్టేషన్‌ సమీపంలో దాడికి తాము బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ-BLA ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్‌ బలగాలు సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని ప్రతినిధి జీయాండ్ బలోచ్ పేర్కొన్నారు.  పాక్‌ నేతలు తమ ప్రజలను అణచి వేస్తున్నారని అన్నారని బలోచ్‌ ఆర్మీలోని మహిళా షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో తెలిపింది.

తమ సంస్కృతి, హక్కులను కాలరాస్తున్నారని మండిపడింది. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని అందులో ఉంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ రైళ్లను లక్ష్యంగా చేసుకోవడం ఇది తొలిసారి కాదు. గడిచిన రెండేళ్లలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ పలుమార్లు దాడులకు గురైంది. 2025 మార్చిలో పెషావర్ వెళ్తున్న రైలును ఉగ్రవాదులు హైజాక్ చేసి పలువురు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు .

 

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×