BigTV English
Advertisement

iQoo Pad 2 Pro: 16 జీబీ ర్యామ్, 1TB స్టోరేజ్, 11,500mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త వేరియంట్.. ఇక రచ్చ రచ్చే..!

iQoo Pad 2 Pro: 16 జీబీ ర్యామ్, 1TB స్టోరేజ్, 11,500mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త వేరియంట్.. ఇక రచ్చ రచ్చే..!

iQoo Pad 2 Pro Launched In China with 11,500mAh Battery: వివో సబ్ బ్రాండ్ ఐక్యూ ఈ ఏడాది మేలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో iQoo Pad 2 Proను మూడు RAM + స్టోరేజ్ వేరియంట్లలో చైనాలో రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ కొత్త మరొక వేరియంట్‌లో iQoo Pad 2 Proను లాంచ్ చేసింది. iQoo ప్యాడ్ 2 ప్రో మొదట్లో 8GB + 256GB, 12GB+ 256GB, 16GB + 512GB వేరియంట్‌లతో చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా CNY 3,399 (దాదాపు రూ. 38,000), CNY 3,699 (దాదాపు రూ. 41,000), CNY 4,099 (దాదాపు రూ.45,000)గా నిర్ణయించారు.


అయితే ఇప్పుడు కంపెనీ మరొక హై రేంజ్ వేరింట్‌ను రిలీజ్ చేసింది. 16GB RAM + 1TB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో టాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. iQoo Neo 9s Pro+ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త వెర్షన్ గురువారం ఆవిష్కరించబడింది. iQoo Pad 2 Pro.. 3.1K రిజల్యూషన్‌తో 13-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Wi-Fi 7 కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 11,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఇక iQoo ప్యాడ్ 2 ప్రో ధర విషయానికొస్తే.. iQoo Pad 2 Pro నుంచి కొత్తగా ప్రారంభించబడిన 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,599 (దాదాపు రూ. 52,000)గా ఉంది. ఇది ప్రస్తుతం చైనాలో బ్లూ టింగ్, గ్రే క్రిస్టల్, సిల్వర్ వింగ్ కలర్ ఆప్షన్లలో సేల్‌కు అందుబాటులో ఉంది. ఈ సెప్టెంబర్‌లోపు టాబ్లెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు iQoo Smart Touch Keyboard 2 Pro, iQoo పెన్సిల్ ఎయిర్‌పై CNY 399 (దాదాపు రూ. 4,500) విలువైన iQoo స్టైలస్‌ను, CNY 300 (దాదాపు రూ.3,400) వరకు తగ్గింపును పొందవచ్చు.


Also Read: ఏందిరా బై ఇది.. పోకో కొత్త ఫోన్ అదిరిపోయిందంతే.. తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు..!

iQoo Pad 2 Pro Specifications

iQoo Pad 2 Pro Android 14 ఆధారిత OriginOS 4పై నడుస్తుంది. ఇది 13-అంగుళాల 3.1K (2,064×3,096 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేతో వస్తుంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది 4nm MediaTek డైమెన్సిటీ 9300+ SoCతో రన్ అవుతుంది. గరిష్టంగా 16GB RAM + 1TB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అలాగే 37,000 మి.మీ చదరపు హీట్ డిస్సిపేషన్ ఏరియాతో త్రీ-డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. iQoo Pad 2 Pro 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది.

ముందు భాగంలో వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. టాబ్లెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, OTG, USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్ కలర్ టెంపరేచర్ సెన్సార్, హాల్ సెన్సార్, గైరోస్కోప్ వంటివి ఉన్నాయి. ఈ టాబ్లెట్ ఎనిమిది స్పీకర్లతో వస్తుంది. iQoo Pad 2 Pro 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో  11,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 14.8 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందించేలా బ్యాటరీ రేట్ చేయబడింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17.7 గంటల వరకు ఆఫ్‌లైన్ వీక్షణ సమయాన్ని, 10.8 గంటల వరకు వీడియో కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.

Related News

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Big Stories

×