BigTV English

Maharashtra MLC elections : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ కూటమి విజయం.. ఏ పార్టీకి ఎన్ని వచ్చాయంటే..

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల ‘మహాయుతి’ కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 11 సీట్ల ఎన్నికల్లో 9 సీట్లు మహాయుతి గెలుచుకుంది. మరి కొన్ని నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివని అందులో తాము విజయం సాధించామని ఏక్ నాథ్ షిండ్ అన్నారు.

Maharashtra MLC elections : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ కూటమి విజయం.. ఏ పార్టీకి ఎన్ని వచ్చాయంటే..

Maharashtra MLC elections(Latest political news in India): మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల ‘మహాయుతి’ కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 11 సీట్ల ఎన్నికల్లో 9 సీట్లు మహాయుతి గెలుచుకుంది. మరి కొన్ని నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివని అందులో తాము విజయం సాధించామని ఏక్ నాథ్ షిండ్ అన్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ కూటమికి రెండు ఎమ్మెల్సీ సీట్లు దక్కాయి.


అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 11 సీట్లకు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ కూటమి కేవలం మూడు సీట్లపైన మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసింది.

Also Read| రైతులను తుపాకీతో బెదిరిస్తూ ట్రైనీ ఐఏఎస్ అధికారి తల్లి హల్‌చల్‌


బిజేపీ తరపున పంకజ మొండే, యోగేష్ తిలేకర్, పరినయ్ ఫూకే, అమిత్ గోర్ఖే, సదాభౌ ఖోటే.. ఈ అయిదుగురు విజయం సాధించారు. అజిత్ పవార్ ఎన్ సీపీకి చెందిన రాజేష్ విటేకర్, శివాజీ రావ్ గర్జే, గెలుపొందారు. అలాగే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీ తరపున కృపాల్ తుమానె, భావన గవాలి ఎన్నికల్లో విజయం సాధించారు. పోటీ చేసిన తొమ్మిది సీట్లపై విజయం సాధించడంతో మహాయుతి కూటమి నాయకులు ఉత్సాహంగా విజయ వేడుకలు చేసుకుంటున్నారు.

ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ తరపున ప్రదాన్య రాజీవ్ సతవ్, మిలింద్ నార్వేకర్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.

మహాయుతి కూటమి పోటీ చేసిన అన్ని సీట్లు గెలుపొందడం వెనుక కాంగ్రెస్ నాయకులు క్రాస్ ఓటింగ్ చేయడం కూడా ప్రధాన కారణం. మొత్తం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలకు క్రాస్ ఓటింగ్ చేశారని స్థానిక మీడియా తెలిపింది.

Also Read| మోదీ ప్రభుత్వం పూర్తికాలం నిలబడేలా లేదు: దీదీ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి రచించిన వ్యూహాలు విజయవంతమయ్యాయని మహాయుతి నాయకులు చెప్పారు. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముందుగానే ఒప్పించారని విశ్లేషకుల అభిప్రాయం.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×