E-Paper
Advertisement

Kohli-Rohit: కోహ్లీ, రోహిత్ సెంచ‌రీలు..గంభీర్ కు హై బీపీ, ఆస్ప‌త్రి బెడ్ రెడీ అంటూ ! ?

Kohli-Rohit: కోహ్లీ, రోహిత్ సెంచ‌రీలు..గంభీర్ కు హై బీపీ, ఆస్ప‌త్రి బెడ్ రెడీ అంటూ ! ?
Advertisement

Kohli-Rohit: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ మరోసారి రెచ్చిపోయారు. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే సెంచరీలు చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకునేందుకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు మరోసారి సెంచరీలు నమోదు చేశారు. విజయ్ హజారే టోర్నమెంట్ లో ( Vijay Hazare Trophy Elite 2025-26) భాగంగా ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ 61 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. మొదట రోహిత్ శర్మ సెంచరీ చేయగా అటు ఆంధ్రప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్లో 83 బంతుల్లో సెంచరీ చేసి కోహ్లీ కూడా రెచ్చిపోయాడు. ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ నుంచి విరాట్ కోహ్లీ బరిలో దిగగా అటు ముంబై తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు వరుసగా సెంచరీలు చేసిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక నీ ప‌ని అయిపోయింది.. బ్యాగ్ స‌ర్దుకుని, ఇంటికి వెళ్లిపో, రోహిత్‌, కోహ్లీ వ‌చ్చేస్తున్నార‌ని ర్యాగింగ్ చేస్తున్నారు.

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

కోహ్లీ అదిరిపోయే సెంచ‌రీ

Advertisement

విజయ్ హజారే ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Vijay Hazare Trophy Elite 2025-26) భాగంగా ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ అదిరిపోయే సెంచరీ కొట్టాడు. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఆంధ్ర వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆంధ్ర ఎనిమిది వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 101 బంతుల్లో 131 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు 14 బౌండరీలు ఉన్నాయి. కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ నేపథ్యంలో ఢిల్లీ విజయం సాధించింది.

అంతకుముందు రోహిత్ శర్మ కూడా సెంచరీ

ఇదే విజయ్ హజారే టోర్నమెంట్లో భాగంగా గ్రూప్ సి లో ఉన్న ముంబై వర్సెస్ సిక్కిం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా సిక్కిం మొదట బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లు నసకపోయి 236 పరుగులు సాధించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 94 బంతుల్లోనే 150 పరుగులతో రఫ్పాడించాడు. ఈ దెబ్బకు సిక్కింపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబై. ఇలా ఇద్దరు కూడా సెంచరీలు చేసిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇన్ని సెంచరీలు చేసిన జట్టులోకి రాకుండా కోహ్లీ అలాగే రోహిత్ శర్మను ఎలా ఆపుతావు అంటూ నిలదీస్తున్నారు.

Advertisement

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×