BigTV English

iQOO Z9 Turbo+: ఐక్యూ నుంచి బ్లాక్ బస్టర్ ఫోన్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌, 6000mAh బ్యాటరీతో వచ్చేస్తుంది..!

iQOO Z9 Turbo+: ఐక్యూ నుంచి బ్లాక్ బస్టర్ ఫోన్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌, 6000mAh బ్యాటరీతో వచ్చేస్తుంది..!

iQOO Z9 Turbo+ Launching Soon In India: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం మార్కెట్‌లోకి కొత్త కొత్త టెక్నాలజీతో ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో టెక్ బ్రాండ్ ఐక్యూ దేశీయ మార్కెట్‌లో తన హవా చూపిస్తుంది. రకరకాల మోడళ్లను పరిచయం చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే iQOO త్వరలో iQOO Z9 సిరీస్‌లో Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు iQOO సిరీస్‌లో iQOO Z9x, Z9, Z9 టర్బో స్మార్ట్‌ఫోన్‌ల విడుదల అయ్యాయి. Z9 టర్బో స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్ ఉంది.


అయితే ఇప్పుడు Z9 Turbo+కి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ Z9 టర్బో మాదిరిగానే ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ రెండింటిలో ప్రధాన వ్యత్యాసం ఏదన్నా ఉంది అంటే అది ప్రాసెసర్‌లో మాత్రమే అని చెప్పుకోవాలి. Z9 Turbo+లో డైమెన్సిటీ చిప్‌సెట్‌ ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ గురించి వాడి వేడిగా చర్చ నడుస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రారంభానికి ముందు దాని గురించి ముఖ్యమైన సమాచారం వెల్లడి చేయబడింది. ఈ ఫోన్ చైనా 3C సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది. దాని ప్రకారం.. ఈ ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ప్రసిద్ధ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కూడా ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని తెలిపింది.


Also Read: వన్‌ప్లస్, ఒప్పో నుంచి కిర్రాక్ ఫోన్లు.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్..!

అంతేకాకుండా టిప్‌స్టర్ ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి కూడా చెప్పారు. దీని ప్రకారం.. iQOO Z9 Turbo+లో 6.78 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇది OLED ప్యానెల్‌తో వస్తుంది. దీనికి 1.5K రిజల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని అందించవచ్చు. డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పబడింది.

అలాగే ఈ ఫోన్‌లో పెద్ద కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉన్నట్లు వెల్లడైంది. దాదాపు 6000mAh బ్యాటరీతో ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చని చెబుతున్నారు. ర్యామ్ + స్టోరేజ్ గురించి ఇంకా సమాచారం రాలేదు. ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించే అవకాశం ఉంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ టిప్‌స్టర్ వెల్లడించారు.

Related News

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Big Stories

×