OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేయండి. ఖాకీ నుంచి గన్స్ & గులాబ్స్ వరకు, రియల్ గ్యాంగ్‌వార్స్ తో ఈ సిరీస్ ల ట్రైలర్ లను చూస్తేనే ఓరి దేవుడో అనుకుంటారు. బీహార్ నేపథ్యంలో స్టోరీ అంటేనే గన్స్ దగ్గర నుంచి గూండాలు, కుల గొడవలు, ఎలక్షన్ ఫైట్స్, మాఫియా రూల్స్ తో వేడిగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లను లాలూ ప్రసాద్, రబ్రి దేవి, నితీష్ కుమార్ లాంటి రియల్ పాలిటిషియన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తీసారు. ఇక 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సిరీస్ లను చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు ఆడియన్స్. రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కిన ఈ బీహార్ టాప్ రేటెడ్ సిరీస్ లు ఏ ఓటీటీలో ఉన్నాయి ? వాటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఐపీఎస్ అధికారి అమిత్ లోధా రాసిన ‘బీహార్ డైరీస్’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను ఫ్రైడే స్టోరీ టేల్లర్స్ బ్యానర్‌పై శీతల్ భాటియా నిర్మించగా, నీరజ్‌పాండే దర్శకత్వం వహించారు. కరణ్ థాకర్, అవినాశ్ తివారి, అభిమన్యు సింగ్, రవి కిషన్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ 2022 నవంబరు 25న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. 7 ఎపిసోడ్స్ తో ఐయండిబిలో 8.2/10 రేటింగ్ ని పొందింది. ఈ కథ 2000ల కాలం నాటి బీహార్‌లో క్రిమినల్ చందన్ మహ మాఫియా గ్యాంగ్ రూల్ చేస్తుంది. ఈ గ్యాంగ్ కిడ్నాప్స్, మర్డర్స్, పాలిటికల్ లింక్స్ తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. కొత్త IPS ఆఫీసర్ వచ్చి ఏన్‌కౌంటర్స్‌తో కిల్లర్స్ ని క్లీనప్ చేస్తాడు.
వెబ్ సిరీస్ మూడు సీజన్లు హుమా ఖురేషి టైటిల్ పాత్రను పోషించారు. ఈ సిరీస్ సీజన్ 1 కి కరణ్ శర్మ, సీజన్ 2 కి రవీంద్ర గౌతమ్ సీజన్ 3 కి సౌరభ్ భావే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో హుమా ఖురేషి కథానాయికగా సోహుమ్ షా, అమిత్ సియాల్, కని కుస్రుతి, ఇనాముల్హక్ నటించారు. ఈ పొలిటికల్ సిరీస్ 1990లలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని తన రాజకీయ వారసురాలిగా చేసిన బీహార్‌లోని సంఘటనల నుండి ప్రేరణ పొందింది. సీజన్ 1 కథ 1995 నుండి 1999 వరకు నిజ జీవిత సంఘటనలు రణవీర్ సేన, నక్సలైట్ గ్రూపులు, 1997 లక్ష్మణ్‌పూర్ బాథే మారణకాండ, పశుగ్రాసం కుంభకోణం వంటి సంఘటనల నుండి ప్రేరణ పొందింది. మొదటి సీజన్ 2021 మే 28న SonyLIVలో ప్రీమియర్ అయింది. సీజన్ 2 కథ 1999 మధ్యకాలం నాటిది శిల్పి గౌతమ్ మర్డర్, సాధు యాదవ్, రాజీవ్ గోస్వామి, శిబు సోరెన్, మహ్మద్ షాబుద్దీన్, 2000 బీహార్ శాసనసభ ఎన్నికలు వంటి నిజ జీవిత సంఘటనలు పాత్రల నుండి ప్రేరణ పొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐయండిబి 7.9/10 రేటింగ్ తో సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సిరీస్ MX ప్లేయర్ ఒరిజినల్ కోసం రితమ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించారు. ఈ హిందీ భాష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కథ తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ లో ఇద్దరు పేరు మోసిన మాఫియా లీడర్ల చుట్టూ తిరుగుతుంది. ఇది 980ల నాటి నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఇది ఐయండిబి 7.5/10 రేటింగ్ తో MX ప్లేయర్ లో అందుబాటులో ఉంది.
జిమ్మీ షెర్‌గిల్, వినీత్ కుమార్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన ‘సాహెబ్’ హరూన్ షా అలీ బేగ్ చుట్టూ తిరుగుతుంది. ఎలక్షన్స్‌లో గన్స్, బూత్ క్యాప్చరింగ్, కుల వోట్స్ తో ఈ సిరీస్ హాట్ హాట్ గా ఉంటుంది. ఒక గూండా ఎలా మినిస్టర్ అవుతాడో షాకింగ్ ట్విస్టులతో ఈ సిరీస్ చూపిస్తుంది. 2022 లో వచ్చిన ఈ సిరీస్ 7.8/10 ఐయండిబి రేటింగ్ తో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
దుల్కర్ సల్మాన్ (గ్యాంగ్‌స్టర్), రాజ్‌కుమార్ రావు (మెకానిక్), గులాబ్ గుండయ్య (అదితి రావ్) ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ స్టోరీ 1990 కాలం నాటి బీహార్ గ్యాంగ్‌వార్స్, డ్రగ్స్ మాఫియాతో మొదలవుతుంది. బీహార్ మాఫియాను ఇందులో స్టైలిష్‌గా చూపించారు. 2023 లో వచ్చిన ఈ సిరీస్ 7.9/10 రేటింగ్ తో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లు చూస్తే బీహార్ రాజకీయాలు ఎంత డేంజరస్ గా ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది .
Read Also : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్