BigTV English
Advertisement

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

Thiruveer: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలకు ఎప్పుడు ఎవరికీ ఎలాంటి సక్సెస్ వస్తుందో ఊహించడం కష్టం. రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అప్పటివరకు ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోయినా ఒకే ఒక్క సినిమా ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ఇలా ఒక సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో తిరువీర్(Thiruveer) ఒకరు. మసూద సినిమా ద్వారా తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తిరువీర్ ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో (Pre Wedding Show)సినిమా ద్వారా సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు.


తిరువీర్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు..

ఇలా ప్రీ వెడ్డింగ్ షో సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈయన మరో సినిమాకు కమిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. తిరువీర్ హీరోగా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)హీరోయిన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు భరత్ దర్శన్(Bharath Darshan) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మౌలి నిర్మిస్తున్నారు. నేడు ఘనంగా పూజ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా మరొక పది రోజులలో రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతోంది.

భరత్ దర్శన్ దర్శకత్వంలో తిరువీర్..

ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సరికొత్త జానెర్లో ఉండబోతుందని చిత్ర బృందం సినిమా విశేషాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. ఇలా ఫ్రీ వెడ్డింగ్ షో తర్వాత తిరువీర్ మరో సినిమా అవకాశాన్ని అందుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఇటీవల ఐశ్వర్య రాజేష్ కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.


సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్..

ఐశ్వర్య రాజేష్ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ అందుకుంది దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాటు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా తిరువీర్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకున్నారు.

Also Read: The Raja saab: రాజా సాబ్ ఫస్ట్ సింగల్ పై తమన్ అప్డేట్.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయా?

Related News

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం

The Raja saab: రాజా సాబ్ ఫస్ట్ సింగల్ పై తమన్ అప్డేట్.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయా?

Nagachaitanya -Sobhita: శోభితపై ప్రశంసలు కురిపించిన చైతూ… ఆ టాలెంట్ ఎక్కువ అంటూ!

Big Stories

×