BigTV English

Nalgonda District: ‘డియర్ రజినీ.. నన్ను క్షమించు’.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లేఖ

Nalgonda District: ‘డియర్ రజినీ.. నన్ను క్షమించు’.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లేఖ

Nalgonda District Sucide Note: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య కంటతడి పెట్టిస్తోంది. ‘డియన్ రజినీ..నన్ను క్షమించు’ అంటూ రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటన సంచలనంగా మారింది.


‘డియర్ రిజినీ. నిన్ను చాలా బాధపెట్టిన. పిల్లలు జాగ్రత్త. మనకు ఎవరూ లేరు. నేను చాలా ఊహలు కన్నాను. కానీ ఏది కుదరలేదు. వచ్చే జన్మ అని ఉంటే నా పిల్లలకే కొడుకుగా పుడుతా.’ అంటూ రాశారు. అంతేకాకుండా తాను కొంతమందితో చేసిన అప్పును చెల్లించాలని లేఖలో భార్యను కోరాడు. ‘కింద వాళ్ల పేర్లు రాస్తున్న..ఎందుకంటే ఇవ్వకపోతే వాళ్లు తిట్టుకుంటారు.’ అని లేఖలో రాశాడు.

వివరాల ప్రకారం.. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ గా వసీమ్ అత్తర్ ఖాన్(43) పనిచేస్తున్నాడు. ఇతను జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ 1 లో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిస అయినట్లు తెలుస్తోంది.


వసీం భార్య ఫజియా బేగం(రజినీ) కూడా జనరల్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తోంది. ఉదయం భార్య ఆస్పత్రికి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా..చుట్టుపక్కల ఉన్న స్థానికులు గమనించి ఫజియాబేగానికి సమాచారం అందించారు. ఫజియాబేగం వచ్చి చూసే సరికి విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆమె రోదనలు అందరినీ కంటతడి పెట్టించింది.

Also Read: ఏపీలో దారుణం.. భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం!

ఫజియా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు వసీం రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫజియాబేగం అసలు పేరు రజినీ. అయితే వసీం, రజినీ మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ సూసైడ్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. జీతాలు రాకపోవడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ మాటలు అవాస్తవాలని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.

Related News

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Big Stories

×