BigTV English
Advertisement

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Anaganaga Oka raju : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. నటుడుగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేనొక్కడినే వంటి సినిమాల్లో కనిపించాడు నవీన్. ఆ సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కూడా పెద్దగా నవీన్ కనిపించలేదు. బాలీవుడ్ లో తన ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాడు. అలానే యూట్యూబ్ వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయిపోయాడు.


మళ్లీ స్వరూప్ దర్శకుడుగా పరిచయమైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా విపరీతంగా సక్సెస్ అయింది. కేవలం నటిగానే కాకుండా రచయితగా కూడా తన టాలెంట్ను ఆ సినిమాలో చూపించాడు నవీన్. ఆ సినిమా తర్వాత నవీన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జాతి రత్నాల సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిపోయింది.

సంక్రాంతికి ఖాయం

ఎంటర్టైన్మెంట్ సినిమాలుకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు నవీన్. ఒకవైపు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే అద్భుతమైన మెసేజ్ కూడా తన సినిమాల ద్వారా ఇస్తుంటాడు. తాను చివరగా చేసిన మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.


ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కొన్ని వీడియోలు కూడా సినిమా మీద నమ్మకాన్ని మరింత పెంచాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న 2026లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించి వాయిదా పడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ చిత్ర యూనిట్ త్వరలో క్లారిటీ ఇవ్వనుంది. ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.

రాజుగారు ఎక్కడ?

ప్రస్తుతం అనగనగా రాజు సినిమాకి సంబంధించిన షూటింగ్ కపిలేశ్వరపురం లో జరుగుతుంది. ఊళ్ళో రాజకీయాల మీద సాంగ్ తీస్తున్నారు. 14 వరకూ అక్కడే షూట్… తర్వాత హైదరాబాద్ లో షెడ్యూల్ అలాగే జైపూర్ లో సాంగ్ తీసే ప్లానింగ్ లో ఉన్నారు. డిసెంబర్ 20 వరకూ టోటల్ షూట్ కంప్లీట్ చేయబోతున్నారు. 2026 సంక్రాంతి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

వాస్తవానికి ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూనే వచ్చింది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ మంది ఆడియన్స్ కోరుకుంటారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేస్తే చిత్ర యూనిట్ కి కూడా మంచి ప్లేస్ అవుతుంది. మరోవైపు మూవీ యూనిట్ కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది అందుకోసమే ఈ సినిమా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు.

Also Read: RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Related News

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం

The Raja saab: రాజా సాబ్ ఫస్ట్ సింగల్ పై తమన్ అప్డేట్.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయా?

Nagachaitanya -Sobhita: శోభితపై ప్రశంసలు కురిపించిన చైతూ… ఆ టాలెంట్ ఎక్కువ అంటూ!

Big Stories

×