E-Paper
Advertisement

రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!

రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!
Advertisement

Telecom Tariffs: ఇరాన్ యుద్ధం ప్రభావంతో దేశంలో చమురు, గ్యాస్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రీఛార్జ్ ధరలను సైతం టెలికాం రంగ సంస్థలు పెంచే యోచనలో ఉన్నట్లు గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఏకంగా 15 శాతం వరకూ ఛార్జీలు పెరుగుతాయని చర్చ జరుగుతోంది. దీంతో భయందోళన యూజర్లకు టెలికాం వర్గాలు తీపి కబురు అందించాయి. ఇప్పట్లో రీఛార్జ్ ధరలను పెంచే సాహసాం టెలికాం కంపెనీలు చేయకపోవచ్చని పేర్కొన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

దేశంలోని ప్రముఖ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi).. రీఛార్జ్ ధరలను మళ్లీ పెంచే ఆలోచనలో లేవని పరిశ్రమ వర్గాల పేర్కొన్నాయి. గత ఏడాది టెలికాం కంపెనీలు తమ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా సుమారు 15% నుండి 25% వరకు రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఆ భారీ పెరుగుదల తర్వాత టెలికాం మార్కెట్ ఇప్పుడిప్పుడే స్థిరపడుతోందని పేర్కొన్నారు. వినియోగదారులు కూడా పెంచిన ధరలకు అలవాటు పడుతున్న ఈ తరుణంలో మళ్లీ ధరలు పెంచితే కస్టమర్ల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి.

Advertisement

ఇరాన్ యుద్ధం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు.. ప్రపంచ మార్కెట్లను ప్రస్తుతం శాసిస్తున్నాయి. ఫలితంగా ముడి చమురు ధరల్లో అస్థిరత, క్రమంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇప్పటికే దేశంలోని సామాన్యుల ఆర్థిక భారం క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో భారీ టారిఫ్ పెంపు పేరుతో వారిపై మరింత భారాన్ని మోపడం సరికాదని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఒకవేళ పెంచితే సామాన్యుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని అంచనా వేస్తున్నాయి. ఈ కారణాల చేత ధరలు పెంచడం కంటే ప్రస్తుతం ఉన్న కస్టమర్ బేస్‌ను కాపాడుకోవడానికే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ప్రీమియం ఫ్రిజ్‌లు!

Advertisement

విశ్లేషకుల ప్రకారం.. ఈసారి టెలికాం కంపెనీలు టారిఫ్ లను పెంచాల్సి వస్తే.. ధరలు సుమారు 15 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల రోజుకు 1.5GB డేటా వచ్చే 28 రోజుల బేసిక్ ప్లాన్ ధర దాదాపు రూ.50 మేర పెరగనుంది. మరోవైపు ఈ పెంపుతో 5G ప్లాన్ లు మరింత ఖరీదైనవిగా మారిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నాయి. టారిఫ్ లను ఒకవేళ నిజంగానే 15 శాతం పెంచినట్లైతే.. 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీ సగటు వార్షిక ఆదాయం 11 శాతం పెరిగి.. రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్థిక నిపుణుడు మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేశారు. తమ వృద్ధి రేటు సింగిల్ డిజిట్ శాతానికి పడిపోయినప్పుడల్లా టెలికాం కంపెనీలు ఛార్జీలను అమాంతం పెంచటం పరిపాటిగా మారిందని అభిప్రాయపడ్డారు.

Also Read: Jagadatri Koushika : ‘జగదాత్రి’ కౌశిక ఆస్తులు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Related News

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

చిన్న పార్టీలకు పర్ఫెక్ట్ సౌండ్! తక్కువ ధరలోనే బ్లూటూత్ స్పీకర్..బాస్

ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?

సాంగ్స్, మూవీస్ కోసం నంబర్-1 సౌండ్‌బార్! డోంట్ మిస్

BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

ఈ ధరలో ఇలాంటి ఫీచర్లా? 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌తో Poco M8 Power సెన్సేషన్!

క్రిస్టల్ క్లియర్ పిక్చర్, అమేజింగ్ సౌండ్! సామ్‌సంగ్ టీవీ రివ్యూ!

తక్కువ బడ్జెట్‌లో..బ్రాండెడ్ టీవీ! సూపర్ సౌండ్, క్రిస్టల్ క్లియర్ పిక్చర్

Big Stories

Advertisement
×