E-Paper
Advertisement

BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!
Advertisement

BSNL Rs 485 Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తక్కువ ధరలో మెరుగైన ప్లాన్స్ ను అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జియో, ఎయిర్ టెల్, వీఐ ప్లాన్లలో లభించే ప్రీమియం బెనిఫిట్స్ ను.. చాలా చౌకగా వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.485 ప్లాన్.. యూజర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్లాన్ ప్రత్యేకతలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రూ. 485 ప్లాన్ ప్రత్యేకతలు

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను 72 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారికి ఇది పెర్ఫెక్ట్ గా సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఈ ప్లాన్ కింద ఫ్రీ అపరిమిత కాల్స్ ను అందిస్తోంది. దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా కాల్స్ చేసి మాట్లాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు యూజర్లకు లభిస్తాయి.

రోజూవారీ డేటా ఎంతంటే?

Advertisement

రూ.485 ప్లాన్ కింద భారీ డేటానే బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ప్రతీరోజు 2GB హై-స్పీడ్ డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. ప్లాన్ గడువు ముగిసే సమయానికి మెుత్తం 144 GB డేటా యూజర్లు వినియోగించుకోవచ్చు. ఒకవేళ రోజూవారి డేటా అయిపోయినా.. 40Kbps వేగంతో అపరిమితంగా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: వానాకాలం స్పెషల్.. ఈ సెట్టింగ్స్ మార్చకపోతే.. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నా దండగే!

ఎవరికి ఈ ప్లాన్ బెస్ట్?

Advertisement

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ,
రోజూ తగినంత డేటా కావాలనుకునే వారికి ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, సెకండరీ సిమ్ వాడుతున్న వారికి ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇదే తరహా డేటా, వ్యాలిడిటీ కోసం దాదాపు రూ. 700 వరకు వసూలు చేస్తుండగా.. బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 485కే అందించడం గమనార్హం.

Also Read: జియో యూజర్లకు పండగే.. ఒక్క రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. టీవీలో కూడా చూడొచ్చు!

Related News

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

Big Stories

Advertisement
×