బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కొత్త ఫోన్‌కు పాత ఛార్జర్ వాడుతున్నారా? PPS టెక్నాలజీ గురించి తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యరు!

కొత్త ఫోన్‌కు పాత ఛార్జర్ వాడుతున్నారా? PPS టెక్నాలజీ గురించి తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యరు!

PPS Fast Charging: నేటి టెక్ యుగంలో బడ్జెట్ ఫోన్ల నుండి ప్రీమియం ఫోన్ల వరకు దాదాపు అన్నింటికీ యూఎస్‌బీ టైప్-సి (USB-C) పోర్ట్ ఇస్తున్నారు. దీనివల్ల ఒకే ఛార్జర్‌తో అన్ని డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చనే సౌలభ్యం అయితే వచ్చింది కానీ, అన్ని USB-C ఛార్జర్లు ఒకేలా పనిచేయవనేది నిజం. చాలామంది తమ కొత్త ఫోన్లకు పాత ఛార్జర్లనే వాడుతుంటారు. దీనివల్ల ఫోన్ స్లోగా ఛార్జ్ అవ్వడమే కాకుండా.. బ్యాటరీ లైఫ్ కూడా దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం ఛార్జర్లలో PPS టెక్నాలజీ లేకపోవడమే.

PPS అంటే ఏమిటి?

సాధారణంగా మార్కెట్లో దొరికే యూఎస్‌బీ పవర్ డెలివరీ (USB-PD) ఛార్జర్లు ఒక నిర్దిష్ట వోల్టేజ్ (ఉదా: 5V, 9V, 15V) ఆధారంగా స్థిరంగా పవర్‌ను అందిస్తాయి. కానీ, పీపీఎస్ (Programmable Power Supply) అనేది దీనికి అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఇది ఫోన్ బ్యాటరీ శాతాన్ని బట్టి, వేడిని బట్టి వోల్టేజ్, కరెంట్‌ను రియల్ టైమ్‌లో మార్చుకుంటూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కార్లలో ఉండే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ లాంటిది. బ్యాటరీ ఖాళీగా ఉన్నప్పుడు వేగంగా, నిండుతున్న కొద్దీ నెమ్మదిగా పవర్‌ను అడ్జస్ట్ చేస్తూ సురక్షితంగా ఛార్జ్ చేస్తుంది.

Also Read: ఇక నుంచి ఆ పనికి టాయిల్ పేపర్లు అక్కర్లేదు.. బాత్రూమ్ అలవాట్లనే మార్చేస్తున్న స్మార్ట్ టాయిలెట్స్!

మీ ఫోన్ దీనికి సపోర్ట్ చేస్తుందా?

ప్రస్తుతం వస్తున్న శాంసంగ్ గెలాక్సీ (S20 సిరీస్ నుండి S26 అల్ట్రా వరకు), గూగుల్ పిక్సెల్ (పిక్సెల్ 6 సిరీస్ తర్వాతి మోడళ్లు), నథింగ్ ఫోన్ల వంటి ప్రముఖ బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు ఈ పీపీఎస్ ఫీచర్‌తోనే వస్తున్నాయి. మీ ఫోన్ స్పెసిఫికేషన్లలో USB-PD 3.0 లేదా 3.1 అని రాసి ఉంటే.. అది పీపీఎస్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

పాత, చౌకబారు ఛార్జర్ల వల్ల నష్టాలు:

కొత్త ఫోన్లు కొన్నప్పుడు బాక్స్‌లో ఛార్జర్లు ఇవ్వడం కంపెనీలు ఆపేశాయి. దీంతో చాలామంది ఐదేళ్ల నాటి పాత ఛార్జర్లనో, లేదా మార్కెట్లో దొరికే తక్కువ ధర ఛార్జర్లనో వాడుతుంటారు. పీపీఎస్ సపోర్ట్ లేని ఛార్జర్లను వాడటం వల్ల ఫోన్ విపరీతంగా వేడెక్కుతుంది. ఈ అదనపు వేడి కారణంగా ఫోన్ లోపల ఉండే పవర్ మేనేజ్‌మెంట్ ఐసీ (IC) పై భారం పడి, బ్యాటరీ లైఫ్ త్వరగా క్షీణిస్తుంది.

GaN ఛార్జర్లు ఎందుకు బెస్ట్?

కొత్త ఛార్జర్ కొనాలనుకునే వారు కేవలం ఎక్కువ వాటేజ్ (Wattage) ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ, అది పీపీఎస్‌కు సపోర్ట్ చేస్తుందో లేదో చూడటం ముఖ్యం. ప్రస్తుతం సాంప్రదాయ సిలికాన్ ఛార్జర్ల కంటే ‘గ్యాన్’ (Gallium Nitride) ఛార్జర్లు బాగా పాపులర్ అవుతున్నాయి. ఇవి సైజులో చిన్నగా ఉంటూ.. తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తూ, అత్యంత సమర్థవంతంగా ఫోన్లను ఛార్జ్ చేస్తాయి. మల్టిపుల్ పోర్ట్స్ ఉన్న గ్యాన్ ఛార్జర్లను ఎంచుకోవడం వల్ల ఒకే పాయింట్ నుండి అన్ని డివైజ్‌లను సేఫ్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: ఇంత తక్కువ ధరకా? సినిమా హాల్ లాంటి 48W సౌండ్, Google TVతో Blaupunkt QLED TV సంచలనం!

Related News

డీప్ బేస్‌తో దద్దరిల్లిపోవాల్సిందే.. రూ.10 వేల లోపే Blaupunkt కొత్త పార్టీ స్పీకర్ లాంచ్, ఎక్కడ కొనాలంటే?

సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ప్రీమియం ఫ్రిజ్‌లు!

వంట చేయడం ఇక చిటికెలో పని! తప్పకుండా కొనాల్సిన IFB మైక్రోవేవ్స్!

ఇక నుంచి ఆ పనికి టాయిల్ పేపర్లు అక్కర్లేదు.. బాత్రూమ్ అలవాట్లనే మార్చేస్తున్న స్మార్ట్ టాయిలెట్స్!

ఇల్లు ఊడ్చే ఓపిక లేదా ? మీ పని క్షణాల్లోనే.. చేసే రోబోటిక్ క్లీనర్స్

×