E-Paper
Advertisement

ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?

ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?
Advertisement

Vivo T5e: టెక్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివో.. తాజాగా భారతీయ వినియోగదారుల కోసం మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను తీసుకొచ్చింది. Vivo T5e పేరుతో వచ్చిన ఈ కొత్త మోడల్‌ను ట్రెండింగ్ T5 సిరీస్‌లో భాగంగా లాంచ్ చేశారు. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, డ్యూరబిలిటీ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

భారతదేశంలో Vivo T5e ఫోన్ సింగిల్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఏరో బ్లూ, షాడో గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. Amazon Freedom Saleలో ఐఫోన్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

Vivo T5eలో 6.74 అంగుళాల పెద్ద HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఫోన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. అంతేకాకుండా.. నీటి చుక్కలు, ధూళి నుండి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను కూడా ఇచ్చారు.

Advertisement

ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే లేటెస్ట్ ఆరిజిన్ OS 6పై ఈ Vivo T5e రన్ అవుతుంది. దీనిలో యూనిసోక్ T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రోజువారీ వినియోగానికి ఇది సరిపోతుంది. ఇందులో ఉన్న 4GB ర్యామ్‌ను వర్చువల్ విధానంలో మరో 4GB వరకు పెంచుకోవచ్చు. అలాగే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది.

ఇక ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. ఈ ఫోన్ వెనుక వైపు 8MP సింగిల్ కెమెరా, ముందు వైపు సెల్ఫీల కోసం 5MP కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. 5500mAh భారీ బ్యాటరీని కలిగి ఉన్న Vivo T5eను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 47 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుందని వివో పేర్కొంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: షాపింగ్ మాత్రమే కాదు, ఇకపై ఫుడ్ కూడా.. Flipkart కొత్త ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

చిన్న పార్టీలకు పర్ఫెక్ట్ సౌండ్! తక్కువ ధరలోనే బ్లూటూత్ స్పీకర్..బాస్

సాంగ్స్, మూవీస్ కోసం నంబర్-1 సౌండ్‌బార్! డోంట్ మిస్

BSNL మరో చౌకైన ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

ఈ ధరలో ఇలాంటి ఫీచర్లా? 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌తో Poco M8 Power సెన్సేషన్!

క్రిస్టల్ క్లియర్ పిక్చర్, అమేజింగ్ సౌండ్! సామ్‌సంగ్ టీవీ రివ్యూ!

తక్కువ బడ్జెట్‌లో..బ్రాండెడ్ టీవీ! సూపర్ సౌండ్, క్రిస్టల్ క్లియర్ పిక్చర్

Big Stories

Advertisement
×